సృష్టికర్త ఒక్కడే

ఆది, 07/28/2019 - 14:45

అల్లాహ్ ఒక్కడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అన్న విషయం పై రెండు సాధారణ నిదర్శనలు...

సృష్టికర్త ఒక్కడే

భూమి నుండి ఆకాశం వరకు అన్నీ ఒకే పద్ధతిలో నడవటం. సూర్యచంద్రులు తమ నిర్ణిత సమయాలలో రావటం మరియు నిర్ణిత సమయంలో అస్తమించడం. సముద్రాలు ఒకే రీతిలో ప్రవహించటం. చెట్లు ఒకే వైఖరిలో మొలవటం మరియు పెరగటం. ఇవన్నీ సృష్టికర్త కేవలం ఒక్కడే అనడానికి నిదర్శనం. లేకపోతే ప్రపంచంలో అల్లకల్లోలం కనబడేది. సృష్టికర్త ఒక్కడే అనడానికి రెండు నిరద్శనలు:
1. ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలూ మరియు ఆకాశ గ్రంథాలు కూడా అల్లాహ్ ఒక్కడే అని ఉపదేశించాయి. ఒకవేళ మరో అల్లాహ్ కూడా ఉండి ఉంటే అతడు కూడా ప్రవక్తలను అవతరింపజేసేవాడు మరియు గ్రంథాలు పంపేవాడు; అందుకని అల్లాహ్ ఒక్కడే అని తెలుస్తుంది.
2. ఒకవేళ రెండు సృష్టికర్తలు అయి ఉంటే, ప్రపంచం ఒకే పద్ధతిలో నడిచేది కాదు. మరో సృష్టికర్త సృష్టించిన మరో ప్రపంచం కూడా ఉండేది. సూర్యచంద్రులు రెండు రకాలుగా ఉండేవి, కాని అలాలేదు కాబట్టి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అని తెలుస్తుంది.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8