ఇమాం హుసైన్[అ.స] ల వారి బలిదానం యొక్క ఉద్దేశం

శని, 08/31/2019 - 18:25

మానవులలో అన్యాయాన్ని వ్యతిరేకించే ధైర్యాన్ని నింపటం,ధర్మానికి అధర్మానికి మధ్య గల తేడాను చూపుటం,దైవప్రవక్త[స.అ.వ] ల వారి షరీయత్ యొక్క పరిరక్షణ,ముస్లిములకు మంచి కొరకు ఆజ్ఞాపించటం మరియు చెడుకు దూరంగా ఉంచడం లాంటివి ఇమాం హుసైన్[అ.స] ల వారి పవిత్ర బలిదానం యొక్క ముఖ్య ఉద్దేశాలు.

ఇమాం హుసైన్,కర్బలా,బలిదానం

మొహర్రం మరియు ఆషూరా అనగానే నల్లటి వస్త్రధారణ చేసి తమ గుండెలను బాదుకుంటూ కనబడే షీయా ముస్లిములు మరియు పీర్ల ఉరేగింపు మరియు వేరే ఇతర ఆచారాలు గుర్తుకువస్తాయి.మొహర్రం మరియు ఆషూరా అంటే కేవలం ఇవేనా లేదా వీటికి వేరే ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? అనే ప్రశ్న కలుగుతుంది. మొహర్రం అంటే కేవలం ఇవే కావు వీటితో పాటు అహంకారులైన అగ్రరాజ్యాల అన్యాయానికి వ్యతిరేకంగా మనలో గల స్పూర్తిని బలోపేతం చేయడం, మనలో అంతర్దృష్టిని పెంచటం, ఆత్మ పరిసుద్ధి, ప్రవక్తల మరియు ఇమాముల ద్వార మన చేతికి వచ్చిన ఈ షరీయత్ ను పరిరక్షించటం, దైవప్రవక్త[స.అ.వ]ల వారి అహ్లెబైత్[అ.స] ను మానవత్వానికి ఒక ఆదర్శంగా పరిచయం చేయటం,అసలుసిసలైన ఇస్లామును లోకానికి పరిచయం చేయటం, అన్ని వర్గాల ముస్లిముల మధ్య ఐక్యతను పెంపొందించటం అనేవే మొహర్రం మరియు ఇమాం హుసైన్[అ.స]ల వారి బలిదానం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఒకచోట ఇమాం హుసైన్[అ.స]ల వారు తన బలిదానం యొక్క కారణాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: “నా తిరుగుబాటు ఎటువంటి విద్రోహానికి మరియు ఆనందభరిత జీవితాన్ని, అవినీతిని, దౌర్జన్యాన్ని కోరి కాదు, కేవలం నా పితామహుల మతస్తుల యొక్క సంస్కరణ కోసం మరియు మంచిని గురించి ఆజ్ఞాపించటం కొరకు, చెడు నుంచి వారించుట కొరకు మరియు నా పితామహుల మరియు నా తండ్రి అడుగుజాడలలో నడవటం కొరకే”.

రెఫరెన్స్
బిహారుల్ అన్వార్,44వ భాగం,పేజీ నం;329.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10