అబూజర్ సేవకులు జౌన్

గురు, 09/05/2019 - 17:55

అబూజర్ సేవకులైన జౌన్ గురించి సంక్షిప్తంగా.

జౌన్,అబూజర్,కర్బలా.

జౌన్ ఇబ్నె హువ అబూజర్ ల వారి సేవకుడు మరియు ఇమాం హుసైన్[అ.స] ల వారితో పాటు కర్బలాలో ప్రాణత్యాగం చేసిన వారిలో ఒకరు.ఆషూరా రోజున ఇమాం హుసైన్[అ.స] ల వారు జౌన్ ను యుధ్ధ మైదానంలోకి వెళ్ళరాదని ఎంత చెప్పినా జౌన్ "ఆ దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఎప్పటి వరకైతే నా రక్తం మీ రక్తంలో కలవదో నేను మీనుండి దూరమవ్వను" అని పలికారు.ఆషూరా రోజున ఇమాం హుసైన్[అ.స] వారి తరపు నుండి యుధ్ధ భూమిలోకి వెళ్ళి శత్రువులలో 25 మందిని చంపిన జౌన్ చివరకు గాయపడి తన ప్రాణాలను వదిలారు.కర్బలాలో ఎవరికోరకైతే ఇమాం హుసైన్[అ.స] ల వారు ప్రార్ధించారో వారిలో జౌన్ ఒకరు.జౌన్ వద్దకు చేరుకున్న ఇమాం హుసైన్[అ.స] ల వారు "భగవంతుడా ఇతని ముఖాన్ని తెల్లగా మరియు దేహాన్ని పరిమళించేలా మరియు పరలోకంలో సన్మార్గులతో పాటు ఉండేలా,మొహమ్మద్[స.అ.వ] మరియు వారి పరివారానికి దగ్గరగా చేయుము" అని ప్రార్ధించారు.జౌన్,మరణం తరువాత ఇమాం హుసైన్[అ.స] వారి సమాధికి దగ్గరగా ఇతర అమరులతో పాటు వారిని ఖననం చేయటం జరిగింది.

రెఫరెన్స్:ఆయానుష్ షీయా,1వ భాగము,పేజీ నం:605,నఫసుల్ మహ్మూం,ఖుమ్మి,పేజీ నం:263. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18