జ్ఞాని అనుచరణకు అర్హుడు

శుక్ర, 02/14/2020 - 06:34

దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ[అ.స], ప్రజల నాయకత్వానికి అర్హులు అని చెప్పడానికి వారు సహాబీయులందరిలో జ్ఞానులు అన్న ఒక్క విషయం చాలు.

జ్ఞాని అనుచరణకు అర్హుడు

హదీస్: “قَالَ رَسُولُ اللَّهِ[ص]:‏ أَنَا مَدِينَةُ الْعِلْمِ‏ وَ عَلِيٌ‏ بَابُهَا”[ముస్తద్రకె హాకిం, భాగం 3, పేజీ 12] (అనా మదీనతుల్ ఇల్మ్ వ అలీయ్యున్ బాబుహా)
దైవప్రవక్త[స.అ] తరువాత ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], ప్రజల నాయకత్వానికి అర్హులు అనే నిర్ధారణ విషయంలో ఈ ఒక్క హదీసే చాలు. ఎందుకంటే జ్ఞాని ఉన్నప్పుడు అతని ముందు అజ్ఞానిని అనుసరించకూడదు. ఖుర్ఆన్ ప్రవచానుసారం “తెలిసిన వారూ, తెలియని వారూ ఇద్దరూ ఎప్పుడూ సమానులు కాలేరు[అజ్ జుమర్:9]
ఖుర్ఆన్ మరోచోట ఇలా ఉపదేశిస్తుంది: “(కేవలం అల్లాహ్‌యే సత్యం వైపునకు మార్గం చూపుతాడు) అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొందలేనివాడా?”[యూనుస్:35]
మార్గదర్శకుడు జ్ఞాని అయ్యి ఉంటాడు మరియు మార్గదర్శనం పొందాలనుకుంటున్నవాడు అజ్ఞాని అయ్యి ఉంటాడు, అనే విషయం తెలిసిందే.

రిఫరెన్స్
ముస్తద్రకె హాకిం, భాగం 3, పేజీ 12; తారీఖె ఇబ్నె కసీర్, పేజీ 358; మనాఖిబె అహ్మద్ బిన్ హంబల్.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9