ఐదు పూట్ల సామూహిక నమాజు యొక్క పుణ్యం

శని, 02/15/2020 - 15:50

దైవప్రవక్త[స.అ.వ] ల వారి నోట సామూహిక నమాజు యొక్క పుణ్యాన్ని వివరించే ఒక హదీసు.

సామూహిక నమాజు,దైవప్రవక్త,పుణ్యం.

దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరైతే తెల్లవారుజామున చేసే నమాజును సామూహికంగా చేసి సూర్యోదయం వరకు గొప్పవాడు మరియు నిరపేక్షాపరుడైన అల్లాహ్ స్మరణలో గడుపుతాడో అతను స్వర్గంలో డబ్బై శ్రేణులను పొందుతాడు.మరియు రెండు శ్రేణుల మధ్య అంతరం ఎంతంటే అత్యంత వేగంగా పరిగెత్తే ఒక గుర్రం [ఒక శ్రేణి నుండి మరొక శ్రేణికి చేరటానికి] డబ్బై సంవత్సరాలు పరుగెత్తాలి. ఎవరైతే జొహ్ర్ యొక్క నమాజును సామూహికంగా చేస్తారో,శాస్వత నిలయమైన స్వర్గంలో యాభై శ్రేణులను పొందుతాడు.వాటిలో ఒక దాని నుండి మరొక దాని మధ్య అంతరం అత్యంత వేగంగా పరుగెత్తగల గుర్రం యాభై సంవత్సరాలు పరుగెత్తే సమయం. ఎవరైతే అస్ర్ నమాజును సామూహికంగా చెస్తారో దాని పుణ్యం హజ్రత్ ఇస్మాఇల్ [అ.స] ల వారి సంతతికి చెందిన ఎనిమిది మంది[కొనబడిన సేవకులను] విడుధల చేసే పుణ్యం మరియు వారిలో ప్రతీ వ్యక్తి ఒక ఇంటికి యజమాని. మరియు ఎవరైతే మగ్రిబ్ నమాజును సామూహికంగా చేస్తారో వారు స్వీకరింపబడిన ఒక హజ్జ్ మరియు ఉమ్రా చేసిన వారి మాదిరి. మరియు ఎవరైతే ఇషా నమాజును సామూహికంగా చేస్తారో వారు లైలతుల్ ఖద్ర్ [ఘనమైన రాత్రిని] మెలుకువగా ఉండి గడిపినట్లు [ఆ రాత్రిని మెలుకువగా ఉండి గడిపిన పుణ్యాన్ని పొందుతారు].

రెఫరెన్స్: ఆమాలియె షైఖ్ సదూఖ్,పేజీ నం: 141.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12