తన కుమార్తెకు దైవప్రవక్త[స.అ.వ] ల వారి నాలుగు తాకీదులు

శని, 02/15/2020 - 16:36

తన కుమార్తెకు పడుకునే ముందు పాఠించవలసిన కొన్ని నియమాలను గురించి వివరించే దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉల్లేఖనం.

ఫాతిమా జహ్రా,దైవప్రవక్త,నియమాలు.

హజ్రత్ ఫాతిమ జహ్ర[స.అ] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఎప్పుడైతే నా వద్దకు వచ్చారో ఆ సమయంలో నేను పరుపును నేలపై[పడుకోవటానికి] పరిచానో అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు నాతో ఈ విధంగా సెలవిచ్చారు: ఓ ఫాతిమ! నాలుగు పనులు చేసే వరకు నిద్రపోవద్దు: 1.ఖురానును పూర్తి చేసిన తరువాత. 2.దైవప్రవక్తలను [ఆ దేవుని వద్ద] నీ యొక్క సిఫార్సు చేసే వారిగా చేసి. 3. నీ ద్వారా విశ్వాసులను సంతోషించేలా చేసి. 4.హజ్జ్ మరియు ఉమ్రా లను  చేసి. ఈ విధంగా నాతో చెప్పి నమాజులో నిమగ్నమయ్యారు.నేను వారి నమాజు పూర్తి అయ్యే వరకు నిరీక్షించి  ఓ దైవప్రవక్త[స.అ.వ]! మీరు చెప్పిన నాలుగు పనులను ఇంత తక్కువ సమయంలో చేసే స్తోమత నాకు లేదు అన్నాను.అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు చిరునవ్వును చిందించి ఈ విధంగా సెలవిచ్చారు: “ఎప్పుడైతే నువ్వు తౌహీద్ సూరాను మూడు సార్లు పఠిస్తావో ఒక ఖురానును పూర్తి చేసినట్లు,ఎప్పుడైతే నువ్వు నాపై మరియు నా మునుపటి ప్రవక్తలపై సలవాతును పంపుతావో,మేము ప్రళయ దినాన నీ సిఫార్సు చేసే వారమవుతాము,ఎప్పుడైతే నువ్వు ఇతర విశ్వాసుల గురించి ఆ దేవుని సన్నిధిలో క్షమాపణ కోరతావో వారు నీతో సంతోషిస్తారు, మరియు ఎప్పుడైతే “సుబ్ హానల్లాహి వల్ హందు లిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అని పలుకుతావో నువ్వు హజ్జ్ మరియు ఉమ్రా చేసినట్లు.

రెఫరెన్స్: ఖులాసయె అజ్కార్,మఫాతీహుల్ జినాన్,పేజీ నం: 961.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11