దైవప్రవక్త[స.అ] సున్నత్ ను ఎవరి నుండి తెలుసుకోవాలి

మంగళ, 02/18/2020 - 17:11

దైవప్రవక్త[స.అ] సున్నత్ ను ఎవరి నుండి తెలుసుకోవాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త[స.అ] సున్నత్ ను ఎవరి నుండి తెలుసుకోవాలి

దైవప్రవక్త[స.అ] సున్నత్ అనుచరణలో షియా ముస్లింలు పవిత్రులైన ఇమాముల మరియు అహ్లెబైత్[అ.స]లను ఆశ్రయిస్తారు. అహ్లెబైతులు[అ.స] స్పష్టమైన ఆజ్ఞ లేని సంధర్భంలో పరియాలోచన వైపు వెళతారు. కాని మా ప్రియ సోదరులైన అహ్లెసున్నతులు ముందుగా సహాబీయులను ఆశ్రయిస్తారు. వాళ్ళతోనే ఖుర్ఆన్ వ్యాఖ్యానాన్ని, సున్నత్‌లను నేర్చుకుంటారు.
నిజానికి సహాబీయులలో కొందరి పధ్ధతులు, పరిస్థితులు మరియు చర్యలు; వాళ్ళ స్పష్టమైన ఇస్లాం ఆదేశాలకు వ్యతిరేకంగా పరియాలోచన విధానాల సంఘటనలన్నీ చూసుకుంటే వేలకు పైగా ఉన్నాయి అవి తెలిసి కూడా వాళ్ళను అనుసరించడం ఎంతవరకు సరైనవిషయం చెప్పండి!.
ఒకవేళ వారి ఉలమాలతో మీరు ఏ సున్నత్‌ను అనుసరిస్తున్నారు అని ప్రశ్నించగా దైవప్రవక్త[స.అ] సున్నత్ అని జవాబిస్తారు. చూస్తే అది నిజంగా దానికి పూర్తి విరుధ్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే దైవప్రవక్త[స.అ] ఈ ప్రవచనాన్ని ఉల్లేఖిస్తారు “దైవప్రవక్త[స.అ]: నా మరియు ఖులాఫాయే రాషిదీన్‌ల సున్నత్‌పై అమలు చేయండి. దీన్ పట్ల దృఢంగా పక్కాగా ఉండండి”. అంటే అహ్లె సున్నత్‌లు ఎక్కువగా ఖులాఫాయే రాషిదీన్‌ల సున్నతులనే పాటిస్తారు అప్పుడప్పుడు దైవప్రవక్త[స.అ] సున్నతులను, అది కూడా ఖులఫాయే రాషిదీన్ ద్వారా చేరిన సున్నతులే.

రిఫ్రెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్[అ.స] అనుచరణ అవసరమని నిదర్శిస్తున్న హదీసులు అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11