జ్ఞానము గొప్పదనటానికి ఏడు కారణాలు

మంగళ, 03/10/2020 - 14:50

జ్ఞానము ధనం కన్నా గొప్పదనటానికి ఏడు కారణాలు ఇమాం అలి[అ.స] ల వారి నోట.

జ్ఞానము,ఇమాం అలి,కారణాలు.

ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఏడు కారణాల వలన జ్ఞానం ధనము కన్నా గొప్పది: 1.జ్ఞానము ప్రవక్తల వారసత్వ సంపద కానీ ధనము ఫిర్ ఔనుల వారసత్వము.2.జ్ఞానము ఖర్చు చేయటం వలన పెరుగుతుంది కానీ ధనము ఖర్చు చేయటం వలన తగ్గుతుంది.3.జ్ఞానము తన యజమానిని రక్షిస్తుంది కానీ ధనాన్ని రక్షించుటకు ఒక సం రక్షకుడు అవసరం.4.ధనాన్ని విశ్వాసుడు మరియు అవిశ్వాసుడు ఇద్దరూ సంపాదించవచ్చు కానీ జ్ఞానం కేవలం విశ్వాసునికే లభిస్తుంది.5.జ్ఞాని యొక్క అవసరం సమాజంలో అందరికి ఉంటుంది కానీ ధనవంతుని యొక్క అవసరం కొందరికే ఉంటుంది.6.జ్ఞానము[బ్రహ్మజ్ఞానము] మనిషితో పాటు సమాధిలోకి వెళుతుంది కానీ ధనము ఈ లోకంలోనే ఉండిపోతుంది.7.జ్ఞానము[బ్రహ్మజ్ఞానము] తన యజమానికి సిరాత్ యొక్క వంతెనను దాటటానికి శక్తినిస్తుంది కానీ ధనము సిరాత్ వంతెనను దాటేటప్పుడు తన యజమాని మెడలో భారంగా మారి ఆ వంతెనను దాటటానికి ఆటంకంగా మారుతుంది.

రెఫరెన్స్: ఆసారుస్  సాదిఖీన్,13వ భాగము,పేజీ నం:552. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15