కొత్త కొత్త వ్యాధులకు కారణం

మంగళ, 03/24/2020 - 08:43

కొత్త కొత్త వ్యాధులకు కారణం ఏమిటి అన్న విషయం పై హజ్రత్ ఇమామ్ అలీ రిజా[అ.స] హదీస్ వివరణ...

కొత్త కొత్త వ్యాధులకు కారణం

హజ్రత్ ఇమామ్ అలీ రిజా[అ.స] ఉల్లేఖనం: “ఎప్పుడైతే దాసులు ఇంతకు ముందు చేయని పాపాలకు పాల్పడతారో అల్లాహ్ వారి కొరకు వారు ఇంతకు ముందు ఎరగని కష్టాన్ని సృష్టిస్తాడు”[అల్ కాఫీ, భాగం2, పేజీ275]
వివిధ కాలాలలో అంతకు ముందు ఎరగని వ్యాధులు కష్టాలు వచ్చేవి. అంతకు ముందు లేని వ్యాధులు రావడం, ప్రజలు అంతకు ముందు చేయని కొత్త పాపాలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని సూచిస్తుంది. ఉదాహారణకు ఎయిడ్స్, పలు రకాల క్యాన్సర్లు అలాగే ఇప్పుడు ప్రపంచాన్నే దడదడలాడిస్తున్న కరోనా వైరస్.
కరోనా వైరస్ మెల్ల మెల్లగా ప్రపంచమంతటా పాకింది, ఇలాంటి నాజూకు పరిస్థితులలో ఇలాంటి వ్యాధుల నుండి బయటపడాలంటే వైధ్యులు చెప్పిన జాగ్రత్తలతో పాటు మరో కొన్ని అతి ముఖ్యమైన చర్యలు కూడా అమలు పరచటం అవసరం; వాటిలో ఒకటి అస్తగ్ఫార్ మరియు తౌబహ్.
మనిషి తాను చేసిన పాపాల పట్ల ప్రాయశ్చిత్తం చేయాలి, తాను చేసిన చెడు చర్యలను పరిశీలించి వాటిని తన నుండి దూరం చేయటానికి ప్రయత్నించాలి. హూద్ సూరహ్ లో 90వ ఆయత్ లో హజ్రత్ షుఐబ్[అ.స] తన సంఘ ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: “మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా నా ప్రభవు అమిత దయామయుడు, అపార ప్రేమమయుడు”

రిఫరెన్స్
అల్ కాఫీ, షేఖ్ కులైనీ, భాగం2, పేజీ275.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10