హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించారు

ఆది, 04/01/2018 - 07:47

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించారు అన్న విషయాన్ని షైఖ్ సదూఖ్ యొక్క గ్రంథం నుండి ఒక హదీస్ నిదర్శనం.

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించారు

“షైఖ్ సదూఖ్” ఇమామ్ అలీ[అ.స] యొక్క జన్మదినం గురించి ఇలా అనెను: “యజీద్ ఇబ్నె ఖఅనబ్ ఇలా ఉల్లేఖించెను: “నేను అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ మరియు ‘బనీ అబ్దుల్ ఇజ్జ్’ నుండి ఒక సమూహం కాబాకు ఎదురుగా కూర్చోని ఉండగా అనుకోకుండా ‘ఫాతెమా బింతె అసద్’ అల్లాహ్ గృహం వద్దకు వచ్చారు, అప్పుడు ఆమె అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క 9 నెలల కడుపుతో ఉన్నారు. పురుటి నొప్పులు పడుతూ, తన చేతులను దుఆ కోసం ఎత్తి అల్లాహ్ తో ఇలా దుఆ చేసెను: “ప్రభువా! నేను నిన్నూ, ప్రవక్తలు మరియు నీ తరపు నుండి అవతరించబడ్డ గ్రంథములను విశ్వసిస్తాను. మరియు నా పితామహులైన హజ్రత్ ‘ఇబ్రాహీమ్ ఖలీల్[అ.స]’ మాటలను నిదర్శిస్తున్నాను, అతనే ఈ పవిత్ర గృహాన్ని కట్టారు, అయితే ఈ గృహం కట్టిన వారి మరియు నా గర్భంలో ఉన్న బిడ్డ కారణంగా కాన్పును నా పై శులభం చేయి” యజీద్ ఇబ్నె ఖఅనబ్ ఇంకా ఇలా అనెను: అకశ్మాత్తుగా కాబా యొక్క వెనుక భాగం చీల్చుకుంది, ఫాతెమా బింతె అసద్ అల్లాహ్ గృహం లోపలికి ప్రవేశించారు, మా కళ్ళకు కనబడకుండా పోయారు, ఆ తరువాత కాబా యొక్క గోడ అతుక్కు పోయింది! తాళం తెరిసి యదార్థమేమిటా అని తెలుసుకోవాలని వెళ్ళాము కాని అల్లాహ్ గృహం యొక్క తాళం తెరుచుకోలేదు. అప్పుడు తెలుసుకున్నాము ఇదేదో అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జరిగినదని”.[అమాలీ సదూఖ్, పేజీ80]

రిఫ్రెన్స్
షేఖ్ సదీఖ్, అమాలీ సదూఖ్, పేజీ80.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6