అపవిత్ర నోరు

బుధ, 06/19/2019 - 15:12

బనీ ఇస్రాయీల్ కు చెందిన ఒక వ్యక్తి చేసిన దుఆ స్వీకరించకపోవడానికి గల కారణం ఏమిటి అని వివరిస్తున్న రివాయత్ ఉల్లేఖనం.

అపవిత్ర నోరు

హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: బనీ ఇస్రాయీల్ కు చెందిన ఒక భక్తుడు నిరంతరం మూడు సంవత్సరాల వరకు అల్లాహ్ ను ఒక మగబిడ్డ కావాలని ప్రార్ధించాడు; కాని అతడి దుఆ అంగీకరించబడలేదు. అతడు ఒకరోజు ఇలా అన్నాడు: ఓ అల్లాహ్! నేను నీకు దూరంగా ఉన్నానా; నా మాట నీకు వినబడడం లేదు, లేక దగ్గరే ఉండి కూడా నాకు సమాధానమివ్వడం లేదా?!
అతడికి ఇలా సమాధానమివ్వబడింది: మూడు సంవత్సరాల నుండి అల్లాహ్ ను తిట్లతో మరియు బూతులతో అపవిత్రంగా మారిన నోరుతో వేడుకుంటున్నావు, నీ దుఆ స్వీకరించబడాలంటే దౌష్టపదాలను వదిలేయి, అల్లాహ్ కు భయపడు, నీ హృదయం నుండి చెడును దూరం చేయి మరియు నీ ఆలోచనలను మంచిగా మార్చుకో.
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా అన్నారు: అతడు ఆ ఆదేశాలను అమలు చేయడంతో అల్లాహ్ అతడి దుఆను స్వీకరించి అతడికి ఒక కొడుకును ప్రసాదించాడు.[ఉసూలె కాఫీ, భాగం2, పేజీ325]

రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఉసూలే కాఫీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3