సంపుర్ణ స్వచ్ఛత

బుధ, 06/19/2019 - 15:28

ఎదుటివారికి సహాయం చేశామా లేదా అనే అలోచన మాత్రమే ఉండాలి అంతేగాని చేసిన చిన్న సహాయం కూడా అందరికి తెలియాలి అనే ఆలోచన ఉండకూడదు.

సంపుర్ణ స్వచ్ఛత

ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క సహాబీయులలో ఒకరు “అబూ జాఫరె ఖస్అమీ”, వారు ఇలా ఉల్లేఖించారు: ఒకరోజు హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యాభై దీనారులతో నిండి ఉన్న ఒక సంచిని నాకిచ్చి ఇలా అన్నారు: దీన్ని తీసుకెళ్ళి బనీ హాషింకు చెందిన ఫలానా వ్యక్తికి ఇవ్వు; ఎవరు పంపించారో అతడికి చెప్పకు.
ఖస్అమీ వివరణ: నేను ఆ పేదవాడి వద్దకు వెళ్ళి అతడికి ఆ సంచి ఇచ్చాను. అతడు “ఈ డబ్బు ఎవరు పంపించారు?” అని ప్రశ్నించి, అతడే ఇలా అన్నాడు: అల్లాహ్ అతడికి మంచి చేయుగాక. ఈ సంచి పంపించిన వ్యక్తి, కొన్ని రోజులకోసారి, కొంత డబ్బును మా కోసం పంపుతూ ఉంటాడు, దాంతోనే మేము మా జీవితాన్ని గడుపుతూ ఉంటాము, కాని అంత డబ్బు పెట్టుకొని కూడా జాఫరె సాదిఖ్[అ.స], మమ్మల్ని పట్టించుకోరు, మా కోసం ఏదీ పంపించరు, మాలాంటి పేదవారి గురించి ఏమాత్రం ఆలోచించరు!!.[అమాలీ షేఖ్ తూసీ, భాగం2, పేజీ290].

రిఫ్రెన్స్
షేఖ్ తూసీ, అమాలీ.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14