మంచి కానుక

గురు, 06/20/2019 - 18:35

దానం యొక్క సంపూర్ణత ఏమిటంటే నీ వద్దనున్నదంతా దానం చేసేయాలి.

మంచి కానుక

అనస్ ఇబ్నె మాలిక్ ఉల్లేఖనం: ఇమామ్ హసన్[అ.స] యొక్క దాసులలో ఒకదాసి ఒక పువ్వును ఇమామ్ కు కానుకగా ఇచ్చింది. ఇమామ్ ఆ పువ్వును తీసుకొని ఆమెతో “నిన్ను అల్లాహ్ మార్గంలో విముక్తని ప్రసాదిస్తున్నాను” అన్నారు. నేను వారితో ఇలా అన్నాను: “యబ్న రసూరల్లాహ్! నిజంగానే విలువలేని ఒక పువ్వుకు బదులు మీరు ఆ దాసిని విముక్తిని ప్రసాదించారా?” ఇమామ్ ఇలా అన్నారు: దానం యొక్క సంపూర్ణత ఏమిటంటే నీ వద్దనున్నదంతా దానం చేసేయాలి, మరి ఆ దాసి వద్ద ఈ ప్రాపంచిక సంపదలో ఆ పువ్వు తప్ప మరేదీ లేదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “ఎవరైనా మీకు మంచిగా పరకరించినప్పుడు మీరు కూడా అదే విధంగా లేక అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి...”[నిసా:86]. ఆమె ఇచ్చిన కానుకకు బదులు, ఆమె విముక్తికి మించిన బదులు లేదు.[మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం4, పేజీ18]

రిఫ్రెన్స్
మనాఖిబె ఆలె అబీతాలిబ్, ఇబ్నె షహ్రె ఆషూబ్.

   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4