ఎనిమిదవ పాఠం: ఇమామత్

బుధ, 07/17/2019 - 03:48

దైవప్రవక్త[స.అ] తరువాత వారి ఉత్తరాధికారులు ఎవరైనా ఉన్నారా, వారిని ఎవరు నియమిస్తారు అన్న అంశాల పై సంక్షిప్త వివరణ...

ఎనిమిదవ పాఠం: ఇమామత్

ఇమామత్, మన దీన్ యొక్క నాలుగవ మూల విశ్వాసం. అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ అంతిమ దైవప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ] తన తరువాత ప్రజల రుజుమార్గ దర్శకులుగా నియమించిన పవిత్ర ఉత్తరాధికారులను మేము ఇమామ్ అంటాము మరియు వారి ఆదేశాన్ని పాటించడం విధిగా భావిస్తాము. దీనికి సంబంధించిన సంక్షిప్త సంభాషణ:
అంతిమ ప్రవక్త తరువాత;
1. ఉమ్మత్ యొక్క మార్గదర్శి ఎవరు?
జ. ఇమామ్
2. ఇమాములు ఎంతమంది?
జ. పన్నెండు మంది
3. వారిని ఇమామ్ గా ఎవరు నిర్ధారించారు?
జ. అల్లాహ్ వారిని ఇమామ్ గా నిర్ధారించారు
4. వారిని అల్లాహ్ నియమించాడని మనకు ఎలా తెలిసింది?
జ. దైవప్రవక్త[స.అ] మనకు చెప్పారు
5. దైవప్రవక్త[స.అ] తరువాత వారిని ఎలా గుర్తుపట్టాలి?
జ. వారు చేసే అద్భుతకృత్యాల ద్వార
6. అద్భుత కృత్యాలు అనగనేమి?
జ. కేవలం ఒక నబీ లేదా ఇమామ్ మాత్రమే చేయగల పని, వారు తప్ప మరెవరూ వాటిని చేయలేరు. ఉదాహారణకు దైవప్రవక్త[స.అ] చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చీల్చారు మరియు హజ్రత్ అలీ[అ.స] అస్తమించిన సూర్యుణ్ణి తిరిగి తీసుకొచ్చారు.
7. ఎవరైనా ఇమామ్ ను విశ్వసించకుండా విడిచేస్తే ఏమౌతుంది?
జ. ఆ వ్యక్తి మరణం అజ్ఞానపు మరణం(ముష్రిక్ మరణం) మరియు అతడి స్థానం నరకం.
8. ఇమామ్ ఉండడం అవసరమా?
జ. నిస్సందేహంగా, ఇమామ్ దీన్ యొక్క బాధ్యతాదారుడు, ఇమామ్ ద్వారానే ప్రపంచం మిగిలి ఉంది, ఇమామ్ ద్వారానే అల్లాహ్ గురించి తెలుసుకోవచ్చు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9