దుఆయె కుమైల్

శని, 08/17/2019 - 14:39

దుఆయె కుమైల్ మరియు జనాబె కుమైల్ గురించి సంక్షిప్తంగా...

దుఆయె కుమైల్

ప్రపంచ విశ్వాసులు సాధారణంగా గురువారం రాత్రి(షబె జుమా)లో ఒక దుఆను చదువుతారు, ఆ దుఆ పేరే “దుఆయె కుమైల్”. ఈ దుఆ వల్ల చాలా లాభాలున్నాయి. ఈ లోకంలో మనిషి ఉపాది పెరుగుతుంది. పరలోకంలో పాపాలు క్షమించబడతాయి. ఈ దుఆను “దుఆయె కుమైల్” అని ఎందుకంటారంటే; ఈ దుఆను ఇమామ్ అలీ[అ.స] తన శిష్యుడైన జనాబె కుమైల్ కు నేర్పించారు. కుమైల్ వంశం చాలా ఉత్తమ వంశం. వారు వారి సంఘానికి నాయకత్వం వహించేవారు. ఒకసారి ఒకరాజు ఏదో విషయం పై వారిని చంపదెబ్బ కొట్టాడు. కుమైల్ ప్రతికారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు, దానికి రాజు అంగీకరించాడు, కాని వారు అతడిని క్షమించేశారు. కుమైల్ యొక్క పెద్దతనం మరియు ప్రజల వారి పట్ల మర్యాదకు ప్రతికారానికి రాజు వ్యక్తం చేసిన అంగీకారమే నిదర్శనం, లేకపోతే ఏ రాజైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలా అనుమతిస్తాడు!!!. జనాబె కుమైల్ క్షమించి తెలియపరిచారు హజ్రత్ అలీ[అ.స]ను ఇష్టపడే వారు ఇలాగే ఉంటారని. వారు నిరంతరం తన హక్కును వదులుకుంటారు కాని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త హక్కుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు.   

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12