సద్ఖా ప్రాముఖ్యతను తెలిపే ఇమాం సాదిఖ్[అ.స] ల వారి ఒక సంఘటన.

ఇమాం సాదిఖ్[అ.స] ల వారు తన కుమారుడైన మొహమ్మద్ తో ఈ విధంగా సెలవిస్తున్నారు: ప్రియమైన కుమారుడా! ఖర్చులు పోగా ఏమాత్రం ఆదాయం ఎక్కువగా వచ్చింది?దానికి వారి కుమారుడు: నలభై దీనారులు అని జవాబిచ్చాడు.దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారు బయటకి వెళ్ళి ఆ మొత్తాన్ని సద్ఖా ఇవ్వమని ఆజ్ఞాపించారు. దానికి కుమారుడు “అలాగైతే మనకు ఏమీ మిగలదు ఉన్నదంతా ఈ నలభై దీనారులే” అని అన్నాడు.ఇమాం ల వారు “దానిని[ఆ మొత్తాన్ని] సద్ఖా ఇవ్వు, నిశ్చయంగా భగవంతుడు దానికి బదులు ఇస్తాడు,నీకు తెలియదా! ప్రతీ వస్తువుకు ఒక తాళపుచై ఉంటుంది అలాగే జీవనాధారం యొక్క తాళపుచెవి సద్ఖా” అని అన్నారు.మొహమ్మద్ ఇమాం ల వారి ఆజ్ఞానుసారం ఆ సొమ్మును సద్ఖాగా ఇచ్చేసాడు,పది రోజులు గడవక ముందే ఇమాం[అ.స] ల వారి వద్దకు ఒక చొటి నుండి నాలుగు వేళ దీనారుల సొమ్ము వచ్చింది.అప్పుడు ఇమాం సాదిఖ్[అ.స] ల వారు తన కుమారునితో “ప్రియ కుమారుడా!మనము దేవుని కొరకు నలభై దీనారులు ఇచ్చాము భగవంతుడు దానికి బదులు మనకు నాలుగు వేల దీనారులు ఇచ్చాడు” అని అన్నారు.
రెఫరెన్స్: ఉసూలే కాఫీ,4వ భాగము,పేజీ నం:10.
వ్యాఖ్యానించండి