షబే ఖద్ర్ యొక్క నామకరణం

మంగళ, 05/12/2020 - 14:15

పవిత్ర రమజాన్ యొక్క 19,21,23 యొక్క రాత్రులను "షబె ఖద్ర్" అని పిలవటానికి గల కొన్ని కారణాలను ఇచట ప్రస్థావించటం జరిగింది.

షబే ఖద్ర్,రమజాన్,దివ్యఖురాను.

పవిత్ర ఖురాను మరియు హదీసుల ఆధారంగా ఈ రాత్రి షబె ఖద్ర్ అని పిలవబడటానికి ఎన్నో కారణాలున్నాయి,వాటిలో కొన్ని కారణాలు:

1.లైలతుల్ ఖద్ర్ అంటే గొప్ప రాత్రి అని అర్ధం,ఖద్ర్ అంటే గౌరవం లేదా ప్రతిష్ట అని అర్ధం.షబ్ అంటే రాత్రి మరియు ఖద్ర్ అంటే ప్రతిష్ట,అంటే ప్రతిష్టాత్మకమైన రాత్రి అని అర్ధం.దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: నిశ్చయంగా మేము దీనిని(ఈ ఖురానును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేసాము [అల్ ఖద్ర్/1].

2.ఈ రాత్రిలో ఎక్కువ సంఖ్యలో దైవదూతలు భూమికి విచ్చేస్తారు,అలాంటప్పుడు ఈ భూమి ఇరుకైపోతుంది.అందువలన ఈ రాత్రిని ఖద్ర్ అని అంటారు.ఖద్ర్ అంటే "ఇరుకు లేదా బిగుసుకుపోవటం" అని అర్ధం.

3.షబె ఖద్ర్ కు వేరొక అర్ధం "విధి",అంటే ఈ రాత్రిలో అల్లాహ్ దాసుల యొక్క విధి వచ్చే ఏడాది వరకు నిర్ణయించబడుతుంది.తఫ్సీరె అల్ బుర్హాన్ లో ఇమాం బాఖిర్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: షబె ఖద్ర్ లో అల్లాహ్ దాసుల యొక్క అన్ని వ్యవహారాలు,వచ్చే షబె ఖద్ర్ వరకు నిర్ణయించబడతాయి,వాటిలో మంచి చెడు,ఆజ్ఞ పాలన లేదా తిరస్కరణ,పుట్టుక మరియు చావు,జీవుల యొక్క జీవనాధారం మరియు ఆ సంవత్సరంలో జరగబోయే ప్రతీ విషయం నిర్ణయించబడుతుంది,అది కేవలం ఆ అల్లాహ్ కు తెలుసు.

4.కొందరు షబె ఖద్ర్ యొక్క అర్ధాన్ని "దివ్య ఖురాను అవతరణకు ఖరారు చేయబడిన రాత్రి" అని కూడా వివరించటం జరిగింది.

రెఫ్: షబె ఖద్ర్ ఖల్బె మాహె రమజాన్,నాసిర్ బాఖిరి,బీద్ హింది,ఇంతెషారాతె దఫ్తరె తబ్లీఘాతె ఇస్లామియె హౌజయె ఇల్మియయె ఖుం,1376.        

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10