ఒక మంచి నాయకుడి లక్షణం

గురు, 05/14/2020 - 18:40

ఒక మంచి నాయకుడిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలియపరుస్తున్న ఇమామ్ అలీ[అ.స] సంఘటన...

  ఒక మంచి నాయకుడి లక్షణం

ఇమామ్ అలీ[అ.స] కూఫాలో వెళ్తుండగా, దారిలో వారు ఒకామే నీళ్ళతో నిండి ఉన్న కుండను తన భూజం పై ఎత్తుకుని వెళ్తుంది, ఇమామ్ కు, ఈమె ఇంట్లో భర్తలేడు లేదా ఉన్నా ఈమెను పట్టించుకోడు అని అర్థమయ్యింది, వారు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: “నాకు అనుమతిస్తే నేను ఈ కుండను ఇంటి వరకు చేర్చేందుకు సహాయం చేస్తాను”, ఆమె నీళ్ల కుండను ఇమామ్ కు ఇచ్చింది. ఇమామ్ ఆ కుండను ఆమె ఇంటి వరకు చేర్చారు. కుండను నేల పై పెట్టి ఆమెతో నువ్వే ఎందుకు నీళ్ళు తీసుకొస్తున్నావు? బహుశ నీ ఇంట్లో మగవారు ఉండి ఉండరు, అని అన్నారు. ఆమె ఇలా సమాధానం ఇచ్చారు: “ఔను! నా భర్త అలీ[అ.స] సైన్యంలో యుద్ధంలో వీరమరణం చేందాడు, నేను నా అనాధ పిల్లలు మాత్రమే ఉన్నాము. ఇది వినగానే ఇమామ్ అలీ[అ.స] తల్లడిల్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చి రాత్రంతా నిద్రిపోలేదు, ఉదయాన్నే రొట్టెలు, మాంసం, ఖర్జుర పండ్లు మరియు కొత్త డబ్బును తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళారు. తలుపు తట్టారు, ఆమె ఎవరూ? అని ప్రశ్నించింది. నేనే నిన్న నీ ఇంటికి వచ్చిన సోదరుడ్ని అని సమాధానమిచ్చారు. ఆమె అనుమది ఇచ్చింది. వారు ఇంట్లోకి ప్రవేశించారు. వారే స్వయంగా ఆ మాంసంతో కబాబ్ తయారు చేశారు, ఆమె అనాధ పిల్లలకు తినిపించారు, వాళ్ళను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు: “నన్ను క్షమించండి(మీ గురించి తెలుసుకోవటంలో ఆలస్యం అయ్యింది)”, ఆ తరువాత పొయ్యి వెలిగించారు, వారి ముఖం ఆ పొయ్యికి దగ్గర అవ్వడంతో దాని వేడి తగిలింది, అప్పుడు వారు ఇలా అన్నారు: “ఈలోకం మంట రుచి చూడు దాంతో నరకం మంట గుర్తుంటుంది, ఇక ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండవు”

రిఫరెన్స్
మజ్ముఅయే ఆసారె షహీద్ ముతహ్హరీ, భాగం23, పేజీ143-144

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18