ఇబ్నె ముల్జిం పట్ల దయ చూపండి

శని, 05/16/2020 - 15:20

తన జీవితపు ఆఖరి క్షణాలలో తన కుమారుడైన ఇమాం హసన్[అ.స] ల వారితో ఇమాం అలి[అ.స] ల వారి కొన్ని తాకీదులు. 

ఇమాం అలి,ఇబ్నె ముల్జిం,దయ చూపడం.

ఇమాం అలి[అ.స] ల వారు స్పృహలోకి వచ్చినప్పుడు,చేతులు కట్టేసి ఉన్న ఇబ్నె ముల్జిం వైపు చూస్తూ బలహీనమైన స్వరంతో "ఓ ఇబ్నె ముల్జిం! నీవు చాలా దారుణమైన నేరానికి ఒడిగట్టావు,నీ కొరకు నేను ఒక చెడు ఇమామును అయ్యానా? నాకు ఇలాంటి బహుమతిని ఇచ్చావు? నేను నీకు ఎటువంటి ఉపకారాన్ని చేయలేదా?,ఆ తరువాత ఇమాం అలి[అ.స] ల వారు తన కుమారుడైన ఇమాం హసన్[అ.స] తో “ఓ నా కుమారుడా! మీ ఈ బందీ[ఇబ్నె ముల్జిం] తో ఓపికతో ప్రవర్తించండి,ఇతని పట్ల దయ చూపండి.అతని కండ్లు భయంతో ఎలా మెలితిరుగుతున్నాయో చూడటం లేదా? అతడు ఎలా విచారగ్రస్థుడై ఉన్నాడో చూడండి” అన్నారు.అప్పుడు ఇమాం హసన్[అ.స] ల వారు “అతడు మీపై దాడి చేసాడు మరియు మా హృదయాలను బాధపడేలా చేసాడు,కానీ మీరు అతనిని ఓపికతో [మంచితనంతో] ప్రవర్తించమని చెబుతున్నారు” అన్నారు. అప్పుడు ఇమాం అలి[అ.స] ల వారు “అవును మనము ఇతరులను మన్నించే మరియు దయ చూపే దైవప్రవక్త[స.అ.వ] ల వారి పరివారము నుండి ఉన్నాము. నేను ఏ హక్కైతే నీపై ఉంచుతానో [ఆ హక్కుతో చెబుతున్నాను] నేవు ఏది తింటే అతనికి [ఇబ్నె ముల్జిం కి] కూడా అదే పెట్టు,నువ్వు  ఏది త్రాగితే అతనికి కూడా అదే త్రాగించు.అతనిని సంకెళ్ళు మరియు గొలుసులతో లాగకండి,అతని చేతులను కూడా బంధించవద్దు” అని సెలవిచ్చారు.  

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,42వ భాగం,పేజీ నం: 287.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12