ఇమాం అలి[అ.స] వారి ఇంటి యొక్క సామాగ్రి.

మంగళ, 05/26/2020 - 18:40

ఇమాం అలి[అ.స] ల వారి సాదా సీదా జీవితాన్ని వివరించే ఒక సంఘటన.

ఇమాం అలి,సామగ్రి,నివాసం.

సవీద్ బిన్ గఫ్ల ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: ఇమాం అలి[అ.స] ల వారి ఖిలాఫత్ యొక్క సమయంలో ఒక రోజు నాకు వారి ఇంటికి వెళ్ళే అదృష్టం లభించింది.నేను వారి ఇంటికి వెళ్ళి నప్పుడు వారిని కేవలం ఒక చిన్నపాటి మామూలైన చాపపై కూర్చుని ఉండటం చూసాను.అది తప్ప నాకు ఆ ఇంట్లో వేరే ఇతర వస్తువు కనిపించలేదు.అప్పుడు నేను ఇమాం అలి[అ.స] ల వారితో “ఓ అమీరుల్ మోమినీన్! ఈ బైతుల్ మాల్[ప్రభుత్వ ఖజానా] మొత్తం మీ చేతులలోనే ఉంది కదా,కానీ నాకు మీ ఇంట్లో కేవలం ఒక్క ఈ చిన్నపాటి చాప ఒక్కటే కనిపిస్తుంది,వేరే ఇతర అవసరమైన సామగ్రి లేదు” అని అన్నాను.దానికి ఇమాం అలి[అ.స] ల వారు “ఓ గఫ్లా కుమారుడా! తెలివైన వారికి తాము ఉంటున్నా ఇంట్లో వారు శాస్వతంగా లేమని,ఆ ఇంటిని వదిలి వెళ్ళాలని తెలిసినప్పుడు వారు ఆ ఇంట్లో సామాగ్రిని పోగుచేసుకోరు.మా సుఖశాంతుల యొక్క నివాసము మున్ముందు ఉన్నది.మేము [అక్కడ పనికివచ్చే] మంచి సామాగ్రిని ముందే పంపించి ఉన్నాము.తొందరలోనే ఆ నివాసానికి వెళ్ళనున్నాము మరియు అక్కడ సుఖసంతోషాలతో జీవించనున్నాము” అని అన్నారు.

రెఫరెన్స్: దాస్తాన్ హాయె బిహారుల్ అన్వార్,4వ భాగం,పేజీ నం:39.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19