నల్ల జాతి వారు కావటం నేరమా?

సోమ, 06/01/2020 - 17:38

అమెరికాలో జాతివివక్షతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తారస్థాయికి చేరుతున్నాయి."నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నా" అని జార్జ్ ఫ్లాయిడ్ పలికిన మాట కూడా ఈ రోజు నిరసనలలో నినాదమై మార్మోగుతుంది.ఎంతో కాలం జాతి విద్వేషాలతో విసిగిపోయిన నల్ల జాతీయులు "నల్ల జాతి వారు కావటం నేరమా?" అని ప్రశ్నిస్తున్నారు.

అమెరికా,నల్లజాతి,వివక్షత.

అమెరికాలోని వర్జీనియా రాష్త్రానికి 1619లో మొట్టమొదటిసారి 20 మంది అఫ్రికన్లు బంధీలుగా వచ్చారు.అమెరికాలో మొట్టమొదటి నల్లజాతి బానిసలు వారు.ఆ తరువాత ఈ బానిసత్వం కొన్ని వందల ఏళ్ళ పాటు కొనసాగింది.ఆ తరువాత బానిసత్వపు సంకెళ్ళ నుంచి తప్పించుకున్నా వారికి అమెరికన్లతో పాటు విధ్య,ఓటుహక్కు,ఆస్తిహక్కు వెంటనే రాలేదు.చాలా కాలం వారు ద్వితీయ శ్రేణి పౌరుల లాగే ఉన్నారు.1865లో రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో బానిసత్వం అధికారికంగా రద్దైంది.1868లో 14వ సవరణ ద్వారా అఫ్రికన్ అమెరికన్లకు అమెరికా పౌరసత్వం లభించింది.ఈ విధంగా బానిసత్వం నుండి బయటపడ్డా వారికి కష్టాలు తప్పడం లేదు.ఇప్పటికీ నల్లజాతీయులు అమెరికాలో జాతి విద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు."చావులతో విసిగిపోయాం" అని నేషనల్ అసోసీషన్ ఫర్ ద అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అనే సంస్థ నినాదం చేసింది."నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నా" అని జార్జ్ ఫ్లాయిడ్ పలికిన మాట కూడా ఈ రోజు నిరసనలలో నినాదమై మార్మోగుతుంది.ఎంతో కాలం జాతి విద్వేషాలతో విసిగిపోయిన నల్ల జాతీయులు "నల్ల జాతి వారు కావటం నేరమా?" అని ప్రశ్నిస్తున్నారు.దీనికి అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా ఏ సమాధానం చెబుతుందో వేచి చూడాలి .

రెఫరెన్స్: http://akharinkhabar.ir/world/6414679

https://www.bbc.com/telugu/international-52861891

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23