హజ్రత్ మాసూమహ్[అ.స] జియారత్ దర్శనం

శని, 01/13/2018 - 14:58

.ఇమామ్ మూసా కాజిమ్[అ.స] కుమార్తే మరియు ఇమామ్ రిజా[అ.స] యొక్క సొదరి అయిన హజ్రత్ మాసుమా[అ.స] సమాధి దర్శనం యొక్క ప్రతిష్టత.

హజ్రత్ మాసూమహ్[అ.స] జియారత్ దర్శనం

దైవప్రవక్త[స.అ] యొక్క 7వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ మూసా కాజిమ్[అ.స] యొక్క కుమార్తే మరియు 8వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ రిజా[అ.స] యొక్క సొదరి అయిన హజ్రత్ మాసుమా[అ.స] సమాధి దర్శనం యొక్క ప్రతిష్టత మరియు ప్రాముఖ్యత గురించి పవిత్ర మాసుములు పలు రివాయత్ లు ఉల్లేఖించారు.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు.. అల్లాహ్ కు ఒక హరం ఉంది, అది మక్కా. దైవప్రవక్త[స.అ]కు ఒక హరం ఉంది అది మదీనహ్. మరి మా అహ్లె బైత్[అ.స]కు హరం ఉంది, అది ఖుమ్.[కామిలుజ్జియారాత్, పేజీ 536]. మరో రివాయత్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “సంతానం నుండి మూసా ఇబ్నె జాఫర్ కుమార్తె ఖుమ్(పట్టణం)లో మరణిస్తుంది, ఆమె షిఫాఅత్ దయ తోనే మా షియాలందరూ స్వర్గానికి వెళతారు” ఇంకో రివాయత్ ప్రకారం ఆమె జియారత్ దర్శనం యొక్క పుణ్యఫలం స్వర్గం[బిహారుల్ అన్వార్, భాగం102, పేజీ219] ఇమామ్ అలీ రిజా[అ.స] ఉల్లేఖనం ప్రకారం: “మాసూమహ్ ను దర్శించుకున్న వారు నన్ను దర్శించుకున్నట్లే” ఇంకో రివాయత్ ప్రకారం “స్వర్గం అతనిదౌతుంది” . ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] ఇలా ప్రవచించారు: “ఖుమ్ లో పూర్తి శ్రద్ధతో మరియు ఆమె గురించి తెలుసుకొని ఎరుకతో నా మేనత్త(సమాధి)ని దర్శించుకుంటే వారు స్వర్గార్హులౌతారు”.[బిహారుల్ అన్వార్, భాగం102, పేజీ266].

రిఫ్రెన్స్
కామిలుజ్జియారాత్, పేజీ 536. బిహారుల్ అన్వార్, భాగం102, పేజీ219 మరియు 266.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8