మానవునికి అహంకారం అవసరమా?

మంగళ, 01/23/2018 - 17:18

ఇతరులను లెక్క చేయకుండా, అందరిని చిన్నచూపు చూసే అహంభావం కలిగిన ఈ మనవుడు శాస్వతంగా ఈ భూమిపైనే ఉండిపోతాడా? కాదు! మరి ఈ అహంకారం ఎందుకు?

మానవునికి అహంకారం అవసరమా?

అహంకారం లేదా గర్వము అనగా తాను ఇతరుల కన్నా ఉత్తముడనే స్వభావం కలిగ ఉండడం, లేదా ఇతరులను చిన్నచూపు చూడటం. అహంకారం అనేది నైతికంగా కూడా మంచి లక్షణం కాదు. ఈ అహంకారమే షైతాన్ ను ఆ దేవుని సన్నిధి నుండి దూరం చేసి ప్రళయ దినం వరకు శపించబడేవానిగా చేసింది.
ఈ అహంకారం కలుగుటకు కొన్ని కారణములు ప్రస్థావించబడ్డాయి అందులో ముఖ్యమైనవి:
విద్య లేదా జ్ఞానం, మంచి కార్యములు చేయటం, పెద్ద వంశం లేదా కుటుంబం, అందం, బలం, డబ్బూ ఇవన్ని మనిషిలో గర్వం మరియు అహంభావం కలగటానికి గల కారణములు.
అల్లాహ్ తన పవిత్ర గ్రంధంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు:
"سَأَصْرِفُ عَنْ ءَايَٰتِىَ ٱلَّذِينَ يَتَكَبَّرُونَ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَإِن يَرَوْا۟ كُلَّ ءَايَةٍۢ لَّا يُؤْمِنُوا۟ بِهَا وَإِن يَرَوْا۟ سَبِيلَ ٱلرُّشْدِ لَا يَتَّخِذُوهُ سَبِيلًۭا وَإِن يَرَوْا۟ سَبِيلَ ٱلْغَىِّ يَتَّخِذُوهُ سَبِيلًۭا ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا وَكَانُوا۟ عَنْهَا غَٰفِلِينَ"
ఏ హక్కూ లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించేవారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దానిని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే   మాత్రం దాన్ని తమ మార్గంగా చేసు కుంటారు. మా ఆయతులను ధిక్కరించి, వాటిపట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికీ దురవస్థ పట్టింది[అల్-ఆరాఫ్/146].
ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِىٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيْرِ سُلْطَٰنٍ أَتَىٰهُمْ ۖ كَبُرَ مَقْتًا عِندَ ٱللَّهِ وَعِندَ ٱلَّذِينَ ءَامَنُوا۟ ۚ كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍۢ جَبَّارٍۢ.
"(ఎందుకంటే) వారు తమ వద్దకు వచ్చిన ఏ ప్రమాణమూ లేకుండానే, అల్లాహ్‌ నిదర్శనాల విషయంలో(మొండిగా) వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్‌ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ విధంగా గర్విష్టి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ్‌ ముద్ర వేసేస్తాడు."[అల్-గాఫిర్/35].
మహప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ప్రవచించారు:
"ఎవరి హృదయంలో అయితే ఆవగింజంత అహంకారం ఉన్నదో వారు స్వర్గంలొకి ప్రవేశించలేరు మరియు ఎవరి హృదయంలో అయితే ఆవగింజంత మతసంబంధమైన విశ్వాసం ఉన్నదో వారు నరకంలోకి ప్రవేశించలేరు"(మాఆనియుల్ అఖ్బార్,పేజీ నం:241).
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విఘంగా సెలవిచ్చారు:
عَجِبتُ لِلمُتَكَبِّرِ الَّذى كانَ بِالمسِ نُطفَةً وَيَكونُ غَدا جيفَةً
"అహంకారిపై నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నిన్న ఒక వీర్యపు బిందువుగా ఉన్నాడు మరియు రేపు ఒక మృతశరీరంగా మారిపోతాడు(మరి ఈ అహంకారం దేనికి)"[నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:126].

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4