జనాబె ఉమ్ముల్ బనీన్[అ.స]

శని, 02/24/2018 - 19:00

.జనాబె ఉమ్ముల్ బనీన్[అ.స], హజ్రత్ అలీ[అ.స] యొక్క భార్య. ఈమె కర్బలా యుద్ధంలో ఇస్లాం రక్షణకై తన ప్రాణాలు అర్పించిన హజ్రత్ అబ్బాస్ ఇబ్నె అలీ[అ.స] యొక్క తల్లి. వారి గురించి సంక్షిప్తంగా.

జనాబె ఉమ్ముల్ బనీన్[అ.స]

జనాబె ఉమ్ముల్ బనీన్[అ.స], దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ[అ.స] యొక్క భార్య. ఈమె కర్బలా యుద్ధంలో ఇస్లాం రక్షణకై తన ప్రాణాలు అర్పించిన హజ్రత్ అబ్బాస్ ఇబ్నె అలీ[అ.స] యొక్క తల్లి. హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణాంతరం హజ్రత్ అలీ[అ.స] అరబ్ దేశ వాసుల వంశాల పై మంచి అవగాహన ఉన్న తన సోదరుడు అఖీల్ సలహా ప్రకారం ఉమ్ముల్ బనీన్ తో వివాహమాడారు. ఈమెకు నలుగురు కుమారులు, వారు పేర్లు అబ్బాస్, జాఫర్, అబ్దుల్లాహ్ మరియు ఉస్మాన్. వీళ్ళందరూ కర్బలాలో ఇస్లాం రక్షణకై వీరమరణం చేందారు.
జనాబె ఉమ్ముల్ బనీన్[అ.స] కర్బలా సంఘటన వార్త విన్న తరువాత ప్రతీ రోజు మదీనహ్ లో ఉన్న ..బఖీ.. అనబడే స్మసానానికి వెళ్ళి వారి వీరమరణాన్ని, త్యాగాలను తలుచుకుంటూ మర్సియా చదివే వారు. ఆమె పఠనకు చుట్టుప్రక్కల వారు వచ్చేవారు మరియు వారి ఆమె పఠనకు ప్రభావితులయ్యేవారు. ఒక ఉల్లేఖన ప్రకారం కనికరం ఎరగని హృదయంగల మర్వాన్ ఇబ్నె హకమ్ కూడా ఆమె కవిత్వాలను మరియు మర్సియాలను విని అగిపోయేవాడు మరియు ఏడ్చేవాడు. ఇలా ఆమే రోధన తాను జీవించినంత కాలం సాగింది.[ఉమ్ముల్ బనీన్ [అ.స] సయ్యిదతున్నిసాయిల్ అరబ్, పేజీ84] చివరికి ఆమె జుమదస్సానియహ్ యొక్క 13వ తారీఖు, హిజ్రీ యొక్క 64వ సంవత్సరంలో మరణించారు.[రియాహీనుష్షరీఅహ్, జబీహుల్లాహ్ మహల్లాతీ, భాగం3, పేజీ294]

రిఫ్రెన్స్
సయ్యద్ మహ్దీ సవీజ్, ఉమ్ముల్ బనీన్ [అ.స] సయ్యిదతున్నిసాయిల్ అరబ్. జబీహుల్లాహ్ మహల్లాతీ, రియాహీనుష్షరీఅహ్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Fida Hussain, Hyd on

Mashallah. I need more information about her. Plz provided if you have.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4