నిర్ణీత సమయంలో నమాజును పూర్తిచేయటానికి గల ప్రాముఖ్యత

మంగళ, 02/27/2018 - 19:27

నమాజు దేవుని కరుణ మరియు అతని కృపకు పాత్రులు కావటానికి ఒక మూలకారణం దానిని దానికి కేటాయింపబడిన సమయంలో పూర్తి చేయటం ద్వారానే ఆ అల్లాహ్ ఆజ్ఞలకు విలువ ఇచ్చిన వారము అవుతాము.

నిర్ణీత సమయంలో నమాజును పూర్తిచేయటానికి గల ప్రాముఖ్యత

నమాజును దాని నిర్ణీత సమయంలో పూర్తి చేయటం విశ్వాసుల లక్షణం అని దివ్యఖురాన్ పేర్కొంటుంది:
حَٰفِظُوا۟ عَلَى ٱلصَّلَوَٰتِ وَٱلصَّلَوٰةِ ٱلْوُسْطَىٰ وَقُومُوا۟ لِلَّهِ قَٰنِتِينَ
నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి[అల్-బఖర/238].
నమాజును దానికి నిర్ణించిన సమయంలో పూర్తిచేయటం అంటే దాని ద్వారా దేవుని కరుణకు పాత్రులు కావటం మరియు ఎటువంటి ఆటంకం వచ్చినా దానిని లెక్కచేయకుండా అల్లహ్ ఆజ్ఞపాలన చేయడం, దీని ద్వారానే అల్లాహ్ తన దాసులను పరీక్షిస్తాడు.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
“నమాజును దాని మొదటి వెళలలోనే పూర్తిచేయటం సిఫార్సు చేయబడిన మరియు దాని ఉపకారం పెరుగుటకు కారణం’’.
మహాప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ఉల్లేఖించ్చారు:
ఎవరైతే నమాజులను వాటికి కేటాయింపబడిన సమయంలో పూర్తి చేస్తారో నేను వారికి మూడు పరిణామాలకు హామీ ఇస్తున్నాను:ఒకటి వారికి గల కలతలు మరియు దుస్థితులు పరిష్కరింపబడతాయి[ఆ అల్లాహ్ ద్వార],రెండు తన [జీవితపు] ఆఖరి క్షణాలలో సుఖంగా మరియు సంతోషంగా ప్రాణాన్ని వదులుతాడు,నరకపు అగ్ని నుండి విముక్తి పొందుతాడు.
మనిషి ఏ జబ్బు బారినో పడినప్పుడు తనకు తీసుకోవలసిన మందులు ఒక వేళ చేదుగా ఉన్నా వాటి ద్వారానే తనకు ఆరోగ్యం లభిస్తుందని నమ్మి వాటిని[ఒక వేళ చేదుగా ఉనా కూడా] తినటానికి సిధ్ధపడతాడు,అలాగే ఈ లోకంలో కొన్ని పనులను వాటికి కేటాయింపబడిన సమయంలో పూర్తిచేయటం కష్టంగా ఉన్నా వాటి ఫలితం ఇహపరలోకాలలో సుఖాన్ని చేకూరుస్తుంది.

రెఫరెన్స్
సఫీనతుల్ బిహార్,2వ భాగం,పేజీ నం:42,బిహారుల్ అన్వార్,82వ భాగం,పేజీ నం:204 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12