దుబారా ఖర్చు ఇస్లాం ద్రుష్టిలో

సోమ, 04/23/2018 - 16:20

ఖురాన్ మరియు హదీసులలోనే కాదు, ఏ మాత్రం జ్ఞానము కలిగి, అర్ధం చేసుకోగల వారైనా కూడా వృధా చేయటాం లేద దుబారా ఖర్చు సరి కాదు అని అంగీకరిస్తారు.

వృధా ఖర్చు ఇస్లాం దృష్టిలో

సర్వసృష్టికర్త,విశ్వనిర్వాహకుడైన అల్లాహ్ సకలసృష్టిరాసులకు ఉనికిని ప్రసాదించి వారికి జీవనాధారాన్ని కూడా కల్పించాడు,కానీ మానవుడు మాత్రం ఆ అల్లాహ్ ఆజ్ఞలకు కట్టుబడి ఉండకుండా కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు,ఆ నిర్లక్ష్యపు వైఖరే మానవునికి ఎన్నో పాపాలకు దారి చూపిస్తుంది వాటిలోనుంచే ఒకటి ఆ మానవుడు చేసే దుబారా ఖర్చు మరియు జీవనాధారాన్ని వృధాచేయటం,ఈ వైఖరిని ఆ మహాప్రవక్త[స.అ.వ] ద్వారా పంపబడిన దివ్యఖురాన్ మరియు హదీసులలో ఖండించడం జరిగింది.
దుబారా ఖర్చు చేసే వారు షైతాన్ సోదరులు:
إِنَّ ٱلْمُبَذِّرِينَ كَانُوٓا۟ إِخْوَٰنَ ٱلشَّيَٰطِينِ ۖ وَكَانَ ٱلشَّيْطَٰنُ لِرَبِّهِۦ كَفُورًۭا
దుబారా ఖర్చు చేసేవారు షైతానుల సోదరులు. మరి షైతానేమో తన ప్రభువునకు కృతఘ్నుడు.[అల్-ఇస్రా/27].
మితిమీరే వారిని[వృధా చేసే వారిని] ఆ అల్లాహ్ ఇష్టపడడు:
يَٰبَنِىٓ ءَادَمَ خُذُوا۟ زِينَتَكُمْ عِندَ كُلِّ مَسْجِدٍۢ وَكُلُوا۟ وَٱشْرَبُوا۟ وَلَا تُسْرِفُوٓا۟ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْرِفِينَ
ఓ ఆదం సంతతివారలారా! మీరు మస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి. కాని మితిమీరకండి. మితిమీరిపోయే వారిని[వృధా చేసేవారిని] ఆయన(అల్లాహ్‌) ఇష్టపడడు.[అల్-ఆరాఫ్/31].
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: "వృధాకార్యం పేదరికానికి మూలం మరియు నియంత్రణ స్వతంత్రత్వానికి మూలం[కారణం]".[అల్-కాఫి,4వ భాగం,పేజీ నం:53]

రెఫరన్స్
షేఖ్ కులైనీ, అల్-కాఫి,4వ భాగం,పేజీ నం:53.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7