అకాల మరణానికి కారణమయ్యే పాపములు

ఆది, 04/29/2018 - 18:47

మానవుడు చేసే ప్రతీ పని అతని జీవితంపై తన ప్రభావాన్ని చూపుతుంది,అందువలనే ఏ కార్యములు అయితే తన జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతాయో వాటి నుండి జాగ్రత్త వహించడం మంచిది. 

అకాల మరణానికి కారణమయ్యే పాపములు

మానవుని  జన్మ మరియు అతని మ్రుత్యువును ఆ అల్లహ్ నిస్చయిస్తాడు దీనిలో ఎలాంటి సందేహమూ లేదు,కానీ కొన్ని సార్లు మానవుడు తన చేతులతోనే ఆ మ్రుత్యువును దగ్గర చేసుకుంటాడు, హదీసులలో దీనికి గల కారణాలను ప్రస్థావించడం జరిగింది.
1. బాంధవ్యాలను తెంచుకోవడం:
మహనీయ ప్రవక్త[స.అ.వ] ఈ విధంగా ఉల్లేఖించారు: “చుట్టరికాలు[బాంధవ్యాలు] గృహాలను నివాసయోగ్యంగా మరియు మానవుల జీవితకాలాన్ని పెంచుతాయి,ఒక వేళ అలా చేసేవారు మంచివారు కాకపోయినా సరే”. [అంటే బాంధవ్యాలను తెంచుకోవడం వలన మనిషి ఆయువు తగ్గుతుంది].
2. అబధ్ధాలు పలకడం:
మహాప్రవక్త[స.అ.వ] ఈ విధంగా పలికారు: “ఎవరైతే అబధ్ధపు ప్రమాణాలు చేస్తారో [అది తప్పు అని తెలిసి కూడా] వారు ఆ దేవునిపై యుధ్ధానికి వెళ్ళిన వారి మాదిరి మరియు ఈ అబధ్ధపు ప్రమాణం నిశ్చితంగా ఇళ్ళను యజమనులు లేకుండా[అంటే ఆ ఇంటి నుండి ఆ ఇంటి యజామనిని దూరం చేస్తుంది],మరియు ఆ ఇంటి పిల్లలను నిరుపేదలుగా మార్చేస్తుంది”.
3. వ్యభిచారం:
వ్యభిచారం యొక్క విషాధకరమైన ప్రభావాలలో ఒకటి మానవుని జీవితకాలం తగ్గిపోవడం,దాని గురించి మహాప్రవక్త[స.అ.వ] ఈ విధంగా పలికారు: “నా తరువాత ఎప్పుడైతే వ్యభిచారం వ్యాప్తి చెందుతుందో అకాలపు మరణాలు కూడా పెరిగిపోవటం జరుగుతుంది”.
4. తల్లితండ్రులను వేధించటం:
అకాల మరణానికి కరణమయ్యే వేరే కార్యాలలో ఒకటి తల్లితండ్రులను వేధించటం,తల్లితండ్రులతో ఉత్తమంగా ప్రవర్తించమని దివ్యఖురాన్లో చాల చోట్ల ఆజ్ఞాపించడం జరిగింది,అలా చేయని వాడు తన మరణాన్ని తానే స్వయంగా దగ్గర చేసుకున్నవాడవుతాడు.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఏ పాపాలైతే తొందరగా మానవుని నాశానానికి కారణమవుతాయో,అతని మ్రుత్యువును దగ్గరగా చేస్తాయో మరియు ఇళ్ళను [వారి యజమానుల నుండి] ఖాళీగా చేస్తాయో వాటి నుండి ఆ అల్లాహ్ శరణుకోరుతున్నాను”.

రెఫరెన్స్
సఫీనతుల్ బిహార్,1వ భాగం, పేజీ నం:297,514, ఉసూలె కాఫీ,6వ భాగం, పేజీ నం:616, 4వ భాగం, పేజీ నం:81.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11