ఇమామ్ అలీ[అ.స] ఆతిథ్యము

శని, 08/18/2018 - 07:34

అతిధి మర్యదల గురించి సూచించే సంఘటనలో తండ్రీకొడుకులు ఎప్పటికీ సమానుల కాలేరు అన్న విషయం కూడా తెలుస్తుంది.

ఇమామ్ అలీ[అ.స] ఆతిథ్యము

ఒక వ్యక్తి తన కుమారుడితో ఇమామ్ అలీ[అ.స] ఇంటికి అతిధులుగా వచ్చాడు. అలీ[అ.స] వారిని చాలా గౌరవంగా ఆహ్వానించి, వారిని ప్రత్యేకమైన చోట కూర్చోబెట్టి వారి ముందు కూర్చున్నారు. భోజనం సయమం కావచ్చింది, వారు భోజనం చేశారు. భోజనం తరువాత అలీ[అ.స] యొక్క ప్రముఖ దాసుడైన “ఖంబర్” తువాలు, చెతులు కడుక్కోవడానికి పళ్లెము మరియు చెంబులో నీళ్ళు తీసుకొని వచ్చాడు. అలీ[అ.స] అవి ఖంబర్ చేతుల నుండి తీసుకొని అతిధి ముందు చేతులు కడిగించడానికై సిద్ధమయ్యారు. అతిది (చేతులు) వెనక్కి తీసుకుంటూ “ఇదీ కాని విషయం, నేను నా చేతులు పెట్టడం మరియు మీరు కడిగించడం, ఇది అసాధ్యం” అని అన్నాడు. అలీ[అ.స], నీ సొదరుడు కూడా నీ నుండే, వేరు కాదు, నీకు సేవ చేయాలనుకుంటున్నాడు, అల్లాహ్ అతడికి పుణ్యం ప్రసాదిస్తాడు, ఎందుకు పుణ్యకార్యాన్ని అడ్డుకోవాలనుకుంటున్నావు? అని అన్నారు. అయినా సరే అతడు ఒప్పుకోలేదు. చివరికి అతడితో “నేను మొమిన్ సోదరునికి సేవ చేయాలనుకుంటున్నాను, నిరాకరించకు అని అన్నారు” అతిధికి సిగ్గుగా అనిపించి ఒప్పుకున్నాడు. అలీ[అ.స] అతడితో “ఖంబర్ కడిగించి ఉంటే ఎలా మీరు మీ చేతులను శుభ్రంగా, పూర్తిగా కడుక్కుంటారో అలాగే కడుక్కోండి, సిగ్గు పడకండి” అని అన్నారు. అతిధి చేతులు కడిగించిన తరువాత, తన కుమారుడు “ముహమ్మద్ బిని హనఫియ్యాహ్”తో “నువ్వు అతని కుమారుని చేతులు కడిగించు, నేను నీ తండ్రిని కాబట్టి తండ్రి చేతులు కడిగంచాను నువ్వు కుమారుని చేతులు కడిగించు. ఒకవేళ ఇతడి తండ్రి ఇక్కడ లేకుండా ఇతను మాత్రమే ఉంటే స్వయంగా నేనే అతని చేతులను కడిగించేవాడిని, ఒకేచోట తండ్రి కొడుకులిద్దరూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య తేడా ఉంచడం అల్లాహ్ కు ఇష్టం” అని అన్నారు. తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ముహమ్మద్ లేచి అతిధి కుమారుని చేతులను కడిగించారు.
ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] ఈ సంఘటనను ఉల్లేఖించి ఇలా అన్నారు: “నిజమైన షియా అంటే ఇలా ఉండాలి”.[బిహారుల్ అన్వార్, భాగం9, పేజీ598].

రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, చాప్ తబ్రీజ్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Sha Abbas on

Mashaallah....hum sab ko Moula ki bataye huve raste par chalne ki Khuda toufiqh de

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8