ఆయతుల్లాహ్ షాహ్రూదీ[ర.అ]

బుధ, 12/26/2018 - 10:20

ఇరాన్ స్వాతంత్రం అనంతరం ఇస్లామీయ అధికారం స్థాపించబడిన తరువాత గత 10 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థ అధిపతిగా ఉన్న ఆయతుల్లాహ్ షాహ్రూదీ[ర.అ] జీవితం యొక్క మొదటి అధ్యాయం.

ఆయతుల్లాహ్ షాహ్రూదీ[ర.అ]

ఆయతుల్లాహ్ షాహ్రూదీ యొక్క పూర్తి పేరు “సయ్యద్ మహ్మూద్ హాషిమీ షాహ్రూదీ” వారు 1947వ సంవత్సరంలో నజఫ్ పట్టణంలో జన్మించారు. వారి తండ్రి పేరు ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ హాషిమీ షాహ్రూదీ, వీరు ఆయతుల్లాహ్ ఖుయీ[ర.అ] యొక్క ప్రముఖ శిష్యులలో ఒకరు. వారి తల్లి ఖురాసాన్ పట్టణానికి చెందిన ఆయతుల్లాహ్ సయ్యద్ అలీ మదదీ మూసవీ ఖాయీనీ గారి కుమార్తె. వీరు ఇమామ్ రిజా[అ.స] గారి హరమ్ లో నమాజ్ చదివించేవారు.
ఆయతుల్లాహ్ షహ్రూదీ[ర.అ] గారి ప్రాథమిక విద్యాభ్యాసన నజఫ్ పట్టణంలో ఉన్న “అలవీ” మద్రసహ్ లో జరిగింది. వారి మొదటి ఉపాధ్యాయులు హుజ్జతుల్ ఇస్లామ్ షేఖ్ హాదీ సీస్తానీ గారు. వారు 14 ఎళ్ళ వయసులో ఆయతుల్లాహ్ ఖుయీ[ర.అ] చేతులు మీదుగా అమామహ్ ధరించారు. ఇస్లామీయ ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం వారు ఆయతుల్లాహ్ ఖుమైనీ[ర.అ], ఆయతుల్లాహ్ ఖుయీ[ర.అ] మరియు ఆయతుల్లాహ్ షహీద్ సద్ర్[ర.అ] వద్ద ఖారిజ్ విద్యాభ్యాసం చేశారు. వారి ఉపాధ్యాయులలో ఎక్కువగా వారి సంబంధం ఆయతుల్లాహ్ షహీద్ సద్ర్[ర.అ]తో ఉండేది. ఆయతుల్లాహ్ షహీద్ సద్ర్[ర.అ] తన శిష్యులలో ఒకరితో ఆయతుల్లాహ్ షాహ్రూదీ గురించి ఇలా అన్నారు: "హాషిమీ శాస్త్రీయ పరంగా అద్భుతమైన మరియు వివేకమైన అభివృద్ధిని కలిగి ఉన్నారు" షహీద్ సద్ర్(అ.స) మరియు షాహ్రూదీ గల శాస్త్రీయ సంబంధం గురించి ఇలా అన్నారు: “హాషిమీ ఒక రకంగా నా ఆస్తిత్వం”. అందుకనే వారు ముఫ్పై సంవత్సరాలు పూర్తి కాకుండానే తమ ఉస్తాద్ ఆయతుల్లాహ్ షహీద్ సద్ర్[ర.అ] నుండి “ఇజ్తిహాద్” అనుమతి పొందారు.
ఇంకా ఉంది...  

రిఫ్రెన్స్
తస్నీమ్ న్యూస్ రిపోట్ ప్రకారం.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2