దైవప్రవక్త[స.అ] ప్రాణం

మంగళ, 01/08/2019 - 16:05

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గురించి దైవప్రవక్త[స.అ] ప్రవచించిన కొన్ని హదీసుల వివరణ.

దైవప్రవక్త[స.అ] ప్రాణం

1. ఫాతెమా[స.అ] దైవప్రవక్త[స.అ] భాగం: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఫాతెమా నాలో భాగం; ఆమెకు కోపం తెప్పించినవాడు నన్ను కోపం తెప్పించినట్లు”[సహీ బుఖారీ, భాగం2, పేజీ302].
2. ఫాతెమా[స.అ] దైవప్రవక్త[స.అ] హృదయం: దైవప్రవక్త[స.అ] ఫాతెమా[స.అ] చేయి పట్టుకొని ఇంటి బయటకు వచ్చి ఇలా అన్నారు.. ..ఈమె గురించి తెలిసినవారికి తెలుసు మరి తెలియని వారు తెలుసుకోండి., ఈమె కుమార్తె ఫాతెమా బింతె ముహమ్మద్, నాలోని భాగం, ఈమె నా హృదయం....,”[బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ80].
3. ఫాతెమా[స.అ] దైవప్రవక్త[స.అ] కనుల కాంతి: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “అలీ! ఫాతెమా నా భాగం, నా కనుల కాంతి, నా హృదయం యొక్క ఫలము”[రౌజతుల్ వాయిజీన్, పేజీ150]
4. ఫాతెమా[స.అ] దైవప్రవక్త[స.అ] సంతోషానికి కారణం: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఫాతమా నా మనసును సంతోషపరుస్తుంది, అలాగే ఆమె ఇద్దరు కుమారులు నా హృదయం ఫలాలు మరియు ఆమె భర్త నా కనుల కాంతి”[మఖ్తలుల్ హుసైనె ఖారజ్మీ, భాగం1, పేజీ59].
5. ఫాతెమా[స.అ] ప్రతిష్టత భూమ్యాకాశాలకు మించింది: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నా కుమార్తె ఫాతెమాను అల్లాహ్ తన కాంతితో సృష్టించాడు, నా కుమార్తె ఫాతెమా భూమ్యాకాశాల కన్న ప్రతిష్టత గలది”[బిహారుల్ అన్వార్, భాగం15, పేజీ10].
 6. ఫాతెమా[స.అ] అల్లాహ్ యొక్క హజ్జత్(నిదర్శనం): దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను, అలీ, ఫాతెమా, హసన్, హుసైన్ మరియు హుసైన్ యొక్క తొమ్మిది మంది కుమారులు అల్లాహ్ దాసలు పై ఆయన యొక్క హజ్జత్ లు, మా శత్రువులు అల్లాహ్ శత్రువులు మరియు మా మిత్రులు అల్లాహ్ మిత్రులు”[బషారతుల్ ముస్తఫా, పేజీ24].
7. ఫాతెమా[స.అ] ఉమ్మత్ యొక్క ఉత్తమ స్ర్తీ: దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నా ఉమ్మత్ యొక్క ఉత్తమ స్త్రీ ఫాతెమా బింతె ముహమ్మద్[స.అ]”.[ఎహ్ఖాఖుల్ హఖ్, భాగం10, పేజీ115].
హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ప్రతిష్టతను మరియు ఆమె ప్రాముఖ్యతను మరియు ఆమె సద్గుణాలను సూచించే చాలా హదీసులు ఉన్నాయి. ఇక్కడ కేవలం వాటి నుండి అతితక్కువ హదీసులను చెప్పడం జరిగింది.  

రిఫ్రెన్స్
తబస్సీ, ముహమ్మద్ జవాద్, ఫాతెమా[స.అ] ఉల్గూయె హయాతె జీబా.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17