ఆత్మహత్య

సోమ, 01/28/2019 - 07:41

ఆత్మహత్య కేవలం ఇస్లాం మతంలోనే కాదు ప్రతీ మతంలో దుష్కార్యము అని నిశ్చయించబడి ఉంది. ఆత్మహత్య వివేకపరంగా కూడా నిరాకరించబడినదే.

ఆత్మహత్య

ఇస్లాం ప్రకారం ఆత్మహత్య, హత్యతో సమానం. అది హరామ్, పెద్దపాపముల నుండి మరియు ఒకరి ప్రాణాలు తీసినట్టే లెక్క. ఒకవేళ మనిషి కొంచెం దృష్టిపెట్టి ఆలోచిస్తే ఏమాత్రం ఆత్మహత్యకు పాలుపడడు మరియు దాని జోలుకు వెళ్ళడు. నిజానికి ఆత్మహత్య చేసుకునేవాడు మరణం తరువాత జీవితం ఉంది అన్న విషయాన్ని విశ్వసించడనే అర్థం. ఒకవేళ ఈ ఆత్మహత్య ఇక్కడ ఉన్న కష్టాల నుండి ఫరారు అవ్వడానికైతే నిస్సందేహంగా ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం ఆ కష్టాల కన్నా చాలా కష్టమైనదౌతుంది. అంతేకాకుండా మరో ప్రక్క తన తప్పులను లేదా లోపాలను సరిదిద్దుకునే అవకాశాలను చేతులారా పోగొట్టుకుంటున్నాడు, ఇది సమ్మతించలేని మూర్ఖత్వం మరియు అవివేకం. అతిచేదు మరియు ఒక్కసారి జరిగిపోతే సరిదిద్దుకోలేని ఆత్మహత్యను స్వీకరించే బదులు స్వయం అభివృద్ధిని స్వీకరించి తనను చుట్టుముట్టిన కష్టాల నుండి బయటపడవచ్చు.
మేము చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాము, కష్టాలు మనిషికి కాకపోతే జంతువులకు వస్తాయా!, అని. ఆ కష్టాలను ఎదుర్కొని వాటిని జయించినవాడే అల్లాహ్ కు కావలసిన నిజమైన మనిషి. అల్లాహ్ మనలో అలాంటి సంపూర్ణ మనిషినే చూడలనుకుంటున్నాడు. వారికి అల్లాహ్ సహాయం కూడా తోడుగా ఉంటుంది.      

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17