నష్టాన్ని కోరే స్నేహితులు ఇమాం సజ్జాద్(అ.స) ద్రుష్టిలో

సోమ, 01/28/2019 - 20:00

స్నేహం చేయడం కష్టమేం కాదు కానీ ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో తెలుసుకోవడమే కష్టమైన పని.

నష్టాన్ని కోరే స్నేహితులు ఇమాం సజ్జాద్(అ.స) ద్రుష్టిలో

ఇమామె సజ్జాద్ తన కుమారునికి ఉపదేశిస్తూ ఈ విధంగా పలికారు:
1. అబద్ధాలాడే వాడితో స్నేహం చేయవద్దు,ఎందుకంటే అతను ప్రతీ విషయాన్ని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా నీకు చెప్తాడు,దగ్గరగా ఉన్నదాన్ని దూరంగా,దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా నీకు చూపిస్తాడు.
2. పాపాల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వాడికి దూరంగా ఉండుము,ఎందుకంటే అతను నిన్ను ఒక ముద్ద అన్నానికి లేదా దానికన్నా తక్కువకు నిన్ను అమ్మేస్తాడు.
3. పిసినారితో స్నేహం చేయకు,ఎందుకంటే నీకు ఎప్పుడైతే ధనం యొక్క ఎక్కువ అవసరం ఉంటుందో అతను నీకు ధనసహాయం చేయడు.
4. తెలివి లేని వాడితో(మూర్ఖునితో) స్నేహం చేయవద్దు,ఎందుకంటే అతను నీకు సహాయం చేద్దామనుకుని నీకు నష్టాన్ని చేకూరుస్తాడు.
5. బాంధవ్యాలను తెంచుకొనే వాడికి దూరంగా ఉండుము,ఎందుకంటే అతనిపై ఖురాన్లో మూడు సార్లు ధూత్కరించడం జరిగింది.(అల్లహ్ శాపానికి అతను అర్హుడు).

రెఫరెన్స్:
మజ్మూఆయే వరాం, 2వ భాగం, పేజీ నం:15.  

 

 

 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11