మద్యపానం దైవప్రవక్త[స.అ]ల వారి హదీసులలో

శని, 02/16/2019 - 18:42

మధ్యపానమనేది అన్ని మతాలలో మరియు అన్ని గ్రంధాలలో నిషేధించబడింది,ఎందుకంటే మధ్యపానం అన్ని పాపాలకు మూలకారణం,హదీసుల అనుసారంగా అన్ని పాపాలను ఒక గధిలో బంధించినట్లైతే మద్యపానం దానికి తాళపుచెవి లాంటిది.  

మద్యపానం దైవప్రవక్త[స.అ]ల వారి హదీసులలో

దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: మధ్యం,దానిని పిండేవాడిపై,దానిని తయారుచేయుటకు వృక్షాన్ని నాటేవాడిపై,దానిని సేవించే వాడిపై,దానిని త్రాగించే వాడిపై,దానిని అమ్మే వాడిపై,దానిని కొనే వాడీపై,దాని ఆదాయాన్ని తినే వాడిపై,దానిని మోసేవాడిపై,ఎవరిగురించైతే ఆ మధ్యం మోయబడినదో వాడిపై ఆ అల్లాహ్ శాపించడం జరిగింది(ధూత్కరించడం జరిగింది).
వేరే చోట ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసం(ఈమాన్) మరియు మధ్యం(మధ్యపాన కోరిక) ఎప్పటికీ మానవుని హ్రుదయంలో(ఒకే సారి) చోటుచేసుకోలేవు.
త్రాగుబోతు తన సమాధి నుండి లేపబడే విధానాన్ని ప్రస్ఠావిస్తూ మహనీయ ప్రవక్త(స.అ.వ)ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: త్రాగుబోతు తన సమాధి నుండి లేపబడతాడు ఏ విధంగా నంటే అతని నుదుటిపై “ఆ అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందినవాడు” అని వ్రాయబడి ఉంటుంది.
అతని చేసే ప్రార్ధనల విషయాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా ప్రవచించారు: ఎవరైతే మధ్యాన్ని సేవిస్తారో నలభై రోజుల వరకు వారి నమాజులు స్వీకరింపబడదు ఒక వేళ దాని తరువాత కూడా మధ్యాన్ని సేవిస్తే మరొ నలభై రోజుల వరకు అతని ప్రార్ధనలు స్వీకరింపబడవు ఆ మధ్యలోనే అతను ఆ దేవునిని ప్రాయశ్చితం కోరకుండా చనిపొతే ప్రళయదినాన ఆ అల్లాహ్ అతనితో నరకవాసుల పుండ్ల నుంచి వచ్చే రసాన్ని(వారి గాయాల నుండి వచ్చే రసాన్ని) త్రాగిస్తాడు.

రెఫరెన్స్
మీజానుల్ హిక్మహ్,3వ భాగం.    

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10