ప్రళయ దినపు వేడిని సహించగలమా?

మంగళ, 02/19/2019 - 18:15

ఈ లోకంలో కొద్దిపాటి వేడిని సహించలేని ఈ మానవుడు ప్రళయ దినాన ఉండే ఆ తాపాన్ని ఎలా సహించగలడు?

ప్రళయ దినపు వేడిని సహించగలమా?

ఒక రోజు దైవప్రవక్త[స.అ]ల వారు తన సహాబీయులైన సల్మాన్ మరియు అబూజర్ లకు చెరొక దిర్హమును ఇచ్చారు,సల్మాను ఆ దిర్హమును ఆ దేవుని మార్గంలో ఖర్చు చేసారు(దానం చేసారు) కానీ అబూజరు ఆ దిర్హమును తనకు కావలసిన వస్తువులను కొనుటకు ఖర్చుచేసారు,మరుసటి రోజు దైవప్రవక్త[స.అ]ల వారు అగ్నిని వెలిగించి దానిలో ఒక బండరాయిని ఉంచుటకు ఆజ్ఞాపించారు,అగ్నిని వెలిగించిన తరువాట మంటకు ఆ బండరాయి కూడా వేడెక్కింది,ఇప్పుడు ప్రవక్త(స.అ.వ)ల వారు సల్మాను మరియు అబూజరులను పిలిచి “మీరిద్దరు ఒకరి తరువాత మరొకరు ఆ బండరాయిపైకి వెళ్ళి నేను మీకిచ్చిన ఆ దిర్హముకు లెక్కచెప్పవలెను” అని అన్నారు.
అది విన్న వారిద్దరిలో ముందు సల్మాను తొందరగా ఆ బండరాయిపైకి వెళ్ళి నేను ఆ దిర్హమును ఆ దేవుని మార్గములో ఖర్చు చేసాను అని చెప్పి తొందరగా క్రిందికి వచ్చేసారు,ఇప్పుడు అబూజరు యొక్క వంతు వచ్చింది,అబూజరు ఆ మండుతున్న బండరాయిపై ఎలా నిలబడాలి?లెక్క ఎలా చెప్పాలి? అని భయభ్రాంతులకు గురైయ్యారు,అంతలో దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “నేను నిన్ను క్షమించాను,ఎందుకంటే నీవు నీ లెక్క చెప్పుటకు చాలా సమయము పడుతుంది,కానీ ఒక విషయాన్ని తెలుసుకో! ప్రళయ దినానా ఆ మైదానము ఈ బండరాయి కన్నా చాలా ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.  

రెఫరెన్స్: పందె తారీఖ్,1వ భాగము,పేజీ నం:190.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13