ఫాతిమా జహ్ర[స.అ]ల వారి ప్రాముఖ్యత దైవప్రవక్త నోట

శని, 02/23/2019 - 19:25

హజ్రత్ ఫాతిమ జహ్ర[స.అ]ల వారి ప్రాముఖ్యతను వివరించే దైవప్రవక్త[స.అ]ల వారి హదీసులు.

ఫాతిమా జహ్ర[స.అ]ల వారి ప్రాముఖ్యత దైవప్రవక్త నోట

ఫాతిమా జహ్ర[స.అ]ల వారి ప్రాముఖ్యతను వివరించే దైవప్రవక్త[స.అ]ల వారి హదీసులు:
1.”నేను నా కుమార్తెను ఫాతిమా అని ఎందువలన నామకరణం చేశానంటే ఆ భగవంతుడు ఫాతిమా[స.అ]ను,మరియు వారిని ప్రేమించే వారిని నరకాగ్ని నుండి దూరంగా ఉంచటం జరిగింది”.
2. "ఈ లోకంలొ అందరిలో కెల్లా నాకు మాననీయమైనది(ప్రియతమమైనది) నా కూతురు ఫాతిమా[స.అ]".
3. “ఎవరైతే నా కుమార్తె ఫాతిమా[స.అ] ను ప్రేమిస్తారో అతను స్వర్గంలో నాతో ఉంటాడు మరియు ఎవరైతే వారితో శత్రుత్వాన్ని  ప్రదర్శిస్తారో వారు నరకాగ్నిలో మండుతారు”.
4. "ఓ అలి[అ.స]! ఏ పనికొరకైతే ఫాతిమా[స.అ] ఆదేశిస్తుందో దాని పాలన చేయుము ఎందుకంటే నేను ఏ పనులకైతే ఫాతిమా(స.అ)ను ఆదేశించానో వాటిని జిబ్రఈల్[అ.స]ల వారు నాకు ఆదేశించినవి".
5. “శపింపబడిన వాడు,శపింపబడినవాడు నా తరువాత నా కూతురిపై దౌర్జన్యానికి ఒడుగట్టువాడు మరియు వారి హక్కును లాక్కునేవాడు మరియు వారిని హత్య చేయువాడు”(మరణానికి కారణమయ్యేవాడు).

రెఫరెన్స్:

ఉయూనొ అఖ్బారుర్ రిజా,2వ భాగం,పేజీ నం:46,ఆమాలి షైఖ్ సదూఖ్,పేజీ నం:259,బిహారుల్ అన్వార్,43వ భాగం,పేజీ నం:65,బిహార్,22వ భాగం,పేజీ నం:484,బిహార్,73వ భాగం,పేజీ నం:354.  

 

 

  

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16