దైవప్రవక్త[స.అ] దయాగుణం

మంగళ, 03/05/2019 - 16:35

దైవప్రవక్త[స.అ]ల వారి దయాగుణాన్ని తెలిపే ఒక చిన్న సంఘటన. 

దైవప్రవక్త[స.అ] దయాగుణం

అది హిజ్రత్ యొక్క పదవ సంవత్సరము, ఇతరుల రాకపోకలు ఎక్కువగా సాగేవి మహనీయ ప్రవక్త[స.అ]ల వారి కీర్తి కూడా నలుమూలలా వ్యాపించింది, దైవప్రవక్త[స.అ]ల వారి వద్దకు ఒక అరబ్బు వచ్చి ఎదో చెప్పబోతుంటే వారి గురించి అతను విన్న విషయాల వల్ల (భయంతో) అతని నోట మాటలు రాలేదు, నాలుక తడబడసాగింది అది చూసిన దైవప్రవక్త[స.అ]లవారు కలతచెందారు, నన్ను చూసి నీ నాలుక ఎందుకు తడబడుతుంది? అని ప్రశ్నించి అతని దేహం తన దేహాన్ని పూర్తిగా తాకేలా గట్టిగా హత్తుకున్నారు, “ఓ ఆ సహొదరా! ఇప్పుడు నీకు సౌకర్యముగా ఉన్నదా? ఇప్పుడు చెప్పు ఎమైంది? నేను నీవు అనుకున్నట్టు దౌర్జన్యపరుడను కాను, నేను ఏ తల్లి అయితే స్వయానా తన చేతులతో మేక పాలు పితికేదో ఆ తల్లి బిడ్డను, నేను నీ సోదరుని లాంటివాడను నీ బాధలను నాతో చెప్పుకోవచ్చు” అని అన్నారు.
అంతటి ఉన్నత స్థానము మరియు అంత గొప్పహోదా కలిగి ఉండి కూడా ఆ విధంగా ప్రవర్తించటం ఆ మహనీయుడికే సాధ్యం, కొద్దిపాటి ధనాన్ని, పలుకుబడిని కలిగి ఉండే వారే అహంభావంతో విర్రవీగుతుంటారు అలాంటిది పూర్తి ఇస్లాం సామ్రాజ్యానికి ఏకైక నాయకుడైన ఈ మహామనిషికి మనము సాటికాలేము కనీసం అతని అనుయాయులైన సల్మాన్, అబూజర్, మిఖ్దాద్, అమ్మార్ ల నడవడికలో నడుచుకుంటే మన జన్మము సార్దకమైనట్లే.   

రెఫరెన్స్:సీరయె నబవి,3వ భాగము,పేజీ నం:275.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2