అౙాన్ యొక్క ప్రాముఖ్యత హదీసులలో

శని, 03/16/2019 - 19:15

అౙానుకు గల ప్రాముఖ్యతను హదీసుల అనుసారంగా ఈ క్రింది వ్యాసంలో వివరించటం జరిగింది.

అౙాన్ యొక్క ప్రాముఖ్యత హదీసులలో

నమాజుకు ముందు ఇవ్వబడే అౙాను కేవలం నమాజుకు రమ్మని పిలవటం మాత్రమే కాదు వేరే ప్రత్యేకతలు కూడా ఉన్నాయి, వాటిని హదీసులలో ప్రస్థావించటం జరిగింది.
ఆకాశపు వాసులు వినే ఏకైక స్వరం:
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా ప్రవచించారు: “నిశ్చయంగా ఆకాశపు వాసులు భూలోకంపై నివసించే వారి శబ్దాలలో ఒక్క అౙాను యొక్క స్వరాన్ని తప్ప ఎటువంటి శబ్దాలను వినలేరు”.
ఆచారాలను ఉత్తమంగా చేస్తుంది:
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “దురాచారుని(ఎవరైతే దురలవాట్లకు బానిసయ్యడో అతని) చెవిలో అౙాను పలకండి”.
షైతాను దూరమవుతాడు:
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “షైతాను ఎప్పుడైతే అజాను యొక్క శబ్దాన్ని వింటాడో (మీ నుండి దూరంగా) పారిపోతాడు”.
భగవంతుని ద్రుష్టిలో భాగ్యవంతుడు:
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:
ఎవరైతే అౙానును విని దాని వైపు ద్రుష్టిని సారిస్తాడో అతను ఆ భగవంతుని వద్ద భాగ్యవంతునిగా పరిగణించబడతాడు.

రెఫరెన్స్
మీౙానుల్ హిక్మహ్,1వ భాగం, పేజీ నం:82, పేజీ నం:84. 

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2