ఒకే పాపానికి ఐదు వేరు వేరు శిక్షలు

బుధ, 03/20/2019 - 05:06

ఉమర్ వద్దకు వచ్చిన ఒక సమస్యను ఇమామ్ అలీ[అ.స] తీర్మానించారు. అందుకు కారణమేమిటీ అన్న విషయాన్ని సూచిస్తున్న సంఘటన.

ఒకే పాపానికి ఐదు వేరు వేరు శిక్షలు

అమీరుల్ మొమినాన్ అనుచరులలో ఒకరైన “అస్బగ్ ఇబ్నె నబాతహ్” ఇలా ఉల్లేఖించెను: ఒకరోజు ఉమర్ బిన్ ఖత్తాబ్ కూర్చొని ఉండగా, వారి వద్దకు వ్యభిచారానికి పాలుపడిన ఐదుగురి సమస్యను తీర్పు కోసం తీసుకొచ్చారు. ఉమర్ వారందరికీ ఒకే శిక్ష, వ్యభిచారం చేసేవారికి పడే శిక్షే పడాలి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఇమామ్ అలీ[అ.స] కూడా అదే సభలో ఉన్నారు, ఉమర్ ను ఉద్దేశించి ఇలా అన్నారు: “వీళ్ళందరికీ ఒకే తీర్పు సరికాదు, అందరికీ ఒకే శిక్ష విధించడం కుదరదు”
ఉమర్: అయితే మీరే ఏది మంచిదో అదే తీర్పునివ్వండి, దానిని అమలు పరచండి.
ఇమామ్ అలీ[అ.స] ఇలా వెల్లడించారు: మొదటి వ్యక్తికి ఉరితీయాలి, రెండవ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలి, మూడవ వ్యక్తికి వంద కొరడ దెబ్బలు, నాలుగొవ వ్యక్తికి యాబ్భై కొరడా దెబ్బలు, ఐదవ వ్యక్తికి “తఅజీజ్” అనగా కొంచెం చిత్రహింస చేసి వదిలేయాలి.
ఉమర్ మరియు సభలో ఉన్నవారికి ఈ తీర్మానం పై చాలా ఆశ్చర్యం కలిగింది, ఒకే పాపానికి వేరు వేరు శిక్షలకు గల కారణం ఏమిటో తెలియపరచండి అని కోరగా అమీరుల్ మొమినీన్[అ.స] ఇలా సమాధానమిచ్చారు:
మొదటి వ్యక్తి ముష్రిక్కు, ముష్రిక్ మగాడు ముస్లిం ఆడదితో వ్యభిచారానికి పాల్పడితే దాని శిక్ష ఉరి.
రెండవ వ్యక్తి ముస్లిము, కాని అతడికి భార్య ఉంది కాబట్టి, అతడి వ్యభిచార చర్య “ముహ్సినహ్” అవుతుంది అందుకని అతడికి సంగ్సార్(రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) విధించబడుతుంది.
మూడవ వ్యక్తి కూడా ముస్లిమే, అతడికి పెళ్ళికాలేదు కాబట్టి, వంద కొరడ దెబ్బల శిక్షకు అర్హుడు.
నాలుగొవ వ్యక్తి ఒక బానిస కాబట్టి అతడికి సాధరణ వ్యక్తి శిక్షకు సగం శిక్ష మాత్రమే విధించబడుతుంది.
ఐదవ వ్యక్తి పిచ్చోడు, అతడికి ఎటువంటి శిక్ష లేదు, కేవలం కొద్ధిగా చిత్రహింస పెట్టి వదిలేయాలి.[తహ్జీబ్, భాగం10, పేజీ50, హదీస్188]

రిఫ్రెన్స్
షేఖ్ తూసీ, తహ్జీబుల్ అహ్కామ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1