నమ్మకద్రోహం పై హదీస్ వివరణ

బుధ, 03/20/2019 - 06:09

అన్యాయులైనా సరే మీకు నమ్మిన వారికి ద్రోహం తలపెట్టకూడదు అని వివరిస్తున్న హదీస్ సూచన.

నమ్మకద్రోహం పై హదీస్ వివరణ

అబ్దుల్లాహ్ ఇబ్నె సనాన్ ఉల్లేఖనం: మస్జిదె నబవీలో ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉండగా నేను వారి వద్దకు వెళ్ళాను. అప్పుడు వారు అస్ర్ నమాజ్ పూర్తి చేసుకొని తఖీబాత్ స్మరణలో నిమగ్ఘమై ఉన్నారు. నేను వారితో “ప్రవక్త కుమారా! ధనవంతులు మరియు అన్యాయపు అధికారులలో కొంతమంది మమ్మల్ని నమ్మి మా వద్ద తమ ధనాన్ని భద్రపరుస్తూ ఉంటారు. వారు మీ (హక్కు అయిన) ఖుమ్స్ ధనాన్ని కూడా చెల్లించరని మాకు తెలిసు, అయితే మేము వారి నమ్మకంగా పెట్టుకున్న ధనం నుండి అన్యాయంగా తీసుకోవచ్చా, ఇది సమ్మతించదగ్గ విషయమేనా?” అని అడిగాను.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇది విని మూడు సార్లు ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా ఒకవేళ నా తండ్రి అలీ[అ.స]ను హతమార్చిన ఇబ్నె ముల్జిమ్ నాపై నమ్మకంతో నా వద్ద ఏదైనా ఉంచితే కూడా నేను అందులో అన్యాయానికి పాలుపడను, అతడికి తిరిగి ఇచ్చేస్తాను”[బిహారుల్ అన్వార్, భాగం15, పేజీ149]

రిఫ్రెన్స్
అల్లామ మజ్లిసీ, బిహారుల్ అన్వార్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2