విశ్వాసులు అన్నదమ్ములు

శుక్ర, 03/22/2019 - 14:10

ఇస్లాం, ఇతరుల పట్ల సోదరాభావం కలిగి ఉండడాన్ని చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది అన్న విషయంపై ఒక రివాయత్ నిదర్శనం. 

విశ్వాసులు అన్నదమ్ములు

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: ఒక వ్యక్తి తన మరోవ్యక్తి ఇంటి వద్ద నిలబడి ఉన్నాడు, అటువైపు నుండి ఒక దైవదూత వేళ్తూ ఆ వ్యక్తితో “ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు?” అని అడిగాడు.
ఆ వ్యక్తి: ఇది నా సోదరుని ఇల్లు, నేను అతనికి సలామ్ చేసే ఉద్దేశంతో ఇక్కడి వచ్చాను.
దైవదూత: అతడికి నీతో ఏదైనా బంధుత్వం ఉందా! లేక నీకు అతనితో ఏదైనా అవసరం ఉందా!, నీవు అతడిని సలామ్ చేయడానికి వచ్చావు!?.
ఆ వ్యక్తి: వీటిలో ఏదీ కాదు. అతడూ ముస్లిమూ మరియు నేను కూడా ముస్లిమును, కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందాలనే ఉద్దేశంతో అతడికి సలామ్ చేస్తాను.
దైవదూత: నేను అల్లాహ్ తరపు నుండి పంపబడిన దైవదూతను, అల్లాహ్ నీపై శరణు పంపుతున్నాడు. మరియు ఇలా చెబుతున్నాడు “నా దాసుడా! నీవు నన్ను చూడడానికి వచ్చావు మరియు నీవు ఇస్లామీయ సోదరత్వాన్ని కాపాడావు, అందుచేత నేను నీకు స్వర్గాన్ని తప్పనిసరి చేసి, నీపై నరకాగ్నిని హరామ్ గా నిర్ధారించాను.[జామివుల్ అఖ్బార్, పేజీ118].

రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, బరాదరీ అధ్యాయం.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2