వాఖిఅహ్ సూరహ్ ప్రభావం

శని, 03/23/2019 - 05:19

వాఖిఅహ్ సూరహ్ ప్రభావాన్ని సూచిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ ఉల్లేఖనం ద్వార.

వాఖిఅహ్ సూరహ్ ప్రభావం

హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్, దైవప్రవక్త[స.అ] యొక్క నమ్మకస్తులైన సహాబీ, వారు చాలా మర్యాధ మరియు అభిమానం కలిగిఉన్న వ్యక్తి. హజ్రత్ ఉస్మాన్ ఖిలాఫత్ కాలంలో అతడు చాలా అనారోగ్యానికి గురి అయ్యారు, ఆ అనారోగ్యం వలనే వారు ఈ లోకాన్ని విడిచారు.
వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు మూడవ ఖలీఫా వారిని పలకరించడానికని వెళ్ళారు. వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గమనించి ఖలీఫా ఇలా అడిగారు: “ఇబ్నె మస్ఊద్! దేని వల్ల నువ్వు కంగారు పడుతున్నావు.
అబ్దుల్లాహ్ ఇలా సమాధానమిచ్చారు: నా పాపముల వల్ల.
ఖలీఫా: నేను ఏవిధంగా సహాయ పడగలను?.
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్: నేను ఈ సమయంలో అల్లాహ్ యొక్క దయను దర్శించు కోవాలనుకుంటున్నాను.
ఖలీఫా: మీరు అనుమతిస్తే నేను వైధ్యుడ్ని కబురు చేస్తాను.
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్: నిజమైన వైధ్యుడే నాకు అనారోగ్యాన్ని ప్రసాదించాడు.
ఖలీఫా: మీరు అనుమతిస్తే నేను బైతుల్ మాల్(భండాగారము) నుండి మీకు ఆర్థిక సహాయం చేస్తాము(పెన్షన్ ఇస్తాము).
అబ్దుల్లాహ్: నాకు అవసరం ఉన్నప్పుడు నీవు నాకు ఏమీ ఇవ్వలేదు ఇక ఇప్పుడు నాకవసరం లేదు.
ఖలీఫా: పరవాలేదు, ఈ ఆర్థిక సహాయం నీ కుమార్తెకు ఉపయోగపడుతుంది.
ఇబ్నె మస్ఊద్: నా కుమార్తెలకు దీని అవసరం లేదు ఎందుకంటే నేను వారికి “వాఖిఅహ్ సూరహ్” ను నేర్పించాను. నేను దైవప్రవక్త[స.అ]ను ఇలా చెబుతుండగా విన్నాను: “ఎవరైతే ప్రతీ రాత్రి వాఖిఅహ్ సూరహ్ ను చదువుతారో వారు ఎప్పటికీ బీదవారు కారు”.[మజ్ముఅల్ బయాన్, భాగం9, పేజీ211]

రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, బేనియాజీ అధ్యాయం.          

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7