ఇమాం  సజ్జాద్[అ.స] మరియు ఖురాన్

సోమ, 03/25/2019 - 16:15

దివ్యఖురాను ప్రాముఖ్యత మరియు దాని గొప్పతనాన్ని వివరించే ఇమాం సజ్జాద్[అ.స]ల వారి కొన్ని హదీసులు.

ఇమాం  సజ్జాద్[అ.స] మరియు ఖురాన్

దైవవాణియైన ఖురాను మరియు హదీసుల అనుసారంగా దివ్యఖురాను యొక్క పరమార్ధం మరియు దాని ఆయతుల వివరణ దైవప్రవక్త[స.అ] మరియు వారి ఉత్తరాధికారులకే సాధ్యం,వారిలో ఇమాం సజ్జాద్[అ.స]ల వారు ఒకరు ఎందుకంటే వారికి ఖురానుకు విడదీయలేనటువంటి అనుబంధముంది అని చెప్పవచ్చు.ఇమాం సజ్జద్[అ.స]ల వారి హదీసులలో మరియు దూ'అ(ప్రార్ధనల)సంపుటి అయినటువంటి సహీఫయె సజ్జాదియాలలో ఖురాను యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఆయతుల యొక్క వివరణ చాలా చోట్ల దొరుకుతుంది.
1. మార్గ నిర్దేశం చేసే జ్యోతి: దివ్యఖురానులో ఈ దైవవాణికి జ్యోతి(తేజస్సు) అనే నామం కూడా ప్రస్థావించడం జరిగింది,కానీ ఆ తేజస్సు ఎవరి కొరకు అంటే దానికి జవాబులో ఇమాం సజ్జాద్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఓ భగవంతుడా! మేము అంధకారపు చీకటి నుండి మరియు అజ్ఞానం నుండి(ఖురానును అనుసరించటం ద్వారా) ముక్తి పొందుట కొరకు నీవు ఈ ఖురానును ఒక జ్యోతి యొక్క రూపంలో పంపావు”.
2. ఈ ఖురాను ఒక రోగరహితి: దివ్యఖురానులో దీనిని ఒక రోగరహితిగా కూడా వర్ణించటం జరిగింది, కానీ అది ఎలాంటి వారికి రోగ రహితి అన్న ప్రశ్నకు ఇమాం సజ్జాద్(అ.స) వారి హదీసులో వివరణ దొరుకుతుంది.ఆ హదీసులో ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఖురాను రోగరహితి కానీ ఎవరైతే దానిని విశ్వసించి మరియు (అది దేవుని తరపు నుండి అని) నిర్దారించి దానిని అర్ధం చేసుకోవాలనుకుంటారో మరియు (దివ్యఖురాను యొక్క పారాయణాన్ని వినుట కొరకు) కాముగా ఉంటారో, వారి కొరకు ఈ దివ్యఖురాను ఒక రోగరహితి”.
3.ఖురాను గొప్పతనము: ఖురాను యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇమాం సజ్జాద్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఖురాను యొక్క ఆయతులు జ్ఞానపు ఖజానాలు ఎప్పుడైతే ఆ విలువైన ఖజానాలను తెరుస్తావో దానిలో ఉన్న దాని గురించి జాగ్రత్త పడటం నీకు అవసరం(దానిలొ ఉన్న తాత్పర్యాన్ని అర్ధంచేసుకోవటం నీ కర్తవ్యం).

రెఫరెన్స్: షర్హె సహీఫయె సజ్జాదియా,పేజీ నం:204,బిహారుల్ అన్వార్ 46వ భాగం,పేజీ నం:106.                     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8