ఈదె మబ్అస్

గురు, 03/28/2019 - 16:12

జ్ఞానశూన్యులైన మరియు అజ్ఞానపు అంధకారంలో కూరుకుపోయి ఉన్న అరబ్బు సమాజంలో వారికి మార్గదర్శిగా మరియు కరుణామయుడిగా దైవప్రవక్త(స.అ.వ)ల వారు పంపబడ్డారు.అలా దైవప్రవక్తగా ఎన్నుకోబడిన రోజునే "మబ్ అస్" అని అంటారు.   

ఈదె మబ్అస్

“మబ్ అస్” అనగా దైవప్రవక్త(స.అ.వ)ల వారు ఆ అల్లాహ్ తరపు నుండి అతని ప్రవక్తగా ఎన్నుకోబడటం,ఆ ఎన్నుకోబడ్డ రోజునే “మబ్ అస్” యొక్క రోజని అంటారు.సర్వసృష్టిలో ఆ అల్లాహ్ కు మాననీయుడైన ఆ దైవప్రవక్త మొహమ్మద్(స.అ.వ) ఈ లోకానికి ఆ అల్లాహ్ తరపునుండి ఒక దైవదూతగా,ఒక శాంతిస్వరూపునిగా పంపబడటం ఈ సమస్త మానవజాతిపై ఆ అల్లాహ్ చేసిన మహోపకారమే అని చెప్పవచ్చు.అల్లాహ్ దైవఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే,ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు.అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు.వారిని పరిశుధ్ధుల్ని చేస్తాడు.వారికి గ్రంధ జ్ఞానాన్ని,వివేకాన్ని బోధిస్తాడు.నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు”. (ఆలి ఇమ్రాన్/164). అంధవిశ్వాసాలతో అజ్ఞానపు చీకటిలో కూరుకుపోయిన,ఇతరులపై సోదరభావం మరియు ప్రేమలు కరువై జాతి మరియు తెగల రూపంలో ముక్కలుగా విడిపోయి బ్రతుకుతున్న ఆ అరబ్బుల సమాజంలో ఒక కాంతిరేఖగా ఒక కరుణామయుడి రూపంలో దైవప్రవక్త(స.అ.వ)ల వారు పంపబడ్డారు. వేరే చోట దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: (ఓ మొహమ్మద్!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము (అల్ అంబియా/107). ఆ దైవప్రవక్త(స.అ.వ)ల వారి ఉనికే ఈ లోకానికి కారుణ్యమైనప్పుడు ఆయన దైవప్రవక్త(స.అ.వ)గా ఎన్నుకోబడ్డ రోజైన “మబ్ అస్” పండుగ రోజు ఎందుకు కాకూడదు?అది నిజంగా పండుగ రోజే.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8