ఐశ్వర్యం మంచిదా లేక చెడ్డదా?

శుక్ర, 03/29/2019 - 18:34

పేద ముస్లిముల ఆకలి తీర్చి వారి కష్టాలను తొలగించే సంపదను మించిన సంపద లేదు కానీ అదే సంపద పేద వాళ్ళకు శాపంగా మారితే దానికన్నా నీచమైనది ఈ లోకంలో ఏదీ లేదు. 

ఐశ్వర్యం మంచిదా లేదా చెడ్డదా?

ఐశ్వర్యం లేదా సంపద మంచిది మరియు చెడ్డది కూడా,ఎంత ధనమైతే సుఖంగా జీవించటానికి అవసరమో దానిని ఖర్చు చేసి దానితో పాటు ఇతర ముస్లిములను ఆదుకోవటానికి పనికి వచ్చే ధనము మరియు పేదవాళ్ళపై ఖర్చుచేయబడే ధనమైతే చాలా మంచిది మరియు మానవునికి అత్యంత ప్రియమైన ఈ సంపదను దేవుని మార్గంలో ఖర్చు చేయటం ద్వారానే ఆ అల్లాహ్ యొక్క కరుణకు పాత్రుడు కాగలడు.దైవవాణిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: "మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవమార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు.మీరు ఖర్చు పెట్టేదంతా అల్లాహ్ కు తెలుసు" (ఆలి ఇమ్రాన్/92). ఒక వేళ అదే డబ్బు మనిషికి సుఖశాంతులను లేకుండా చేసి అతనికి కష్టాలను తెచ్చిపెట్టి అతని నుండి అతని స్వాతంత్రాన్ని దూరం చేసేదైతే చాలా చెడ్డదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ప్రజల రక్తాన్ని త్రాగుతున్న కుబేరుల అహంకారానికి కారణం ఈ ధనము,తండ్రికొడుకుల మధ్య,తల్లిపిల్లల మధ్య చిచ్చు పెట్టి వారిని విడదీసేదీ కూడా ఈ ధనమే,చరిత్రలో యుధ్ధాల పేరిట అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నది కూడా ఈ ధనమే.ఈ నాడు కూడా ఈ ధనపిచ్చి పట్టిన కొన్ని అగ్ర రాజ్యాలు తమ జేబులను నింపుకోవటానికి సిరియా,ఇరాక్,అఫ్ఘానిస్తాన్,పాలస్తీనా,యెమన్ లాంటి దేశాలలో అమాయకుల రక్తాన్ని చిందించి తమ సుఖశాంతుల కోసం ఆ అమాయక ప్రజలను సుఖశాంతులకు దూరం చేస్తున్నారు. అందుకే ఇస్లాము ఈ ధనాన్ని కూడబెట్టే కన్నా దానిని ఆ దేవుని మార్గములో ఖర్చు చేయమని ఆదేశిస్తుంది. అందుకే ఇస్లాములో నమాజు,రోజా,హజ్ ల తరువాత జకాత్ మరియు ఖుంస్ లాంటి ఒక ఆర్ధిక వ్యవస్థను నెలకొల్పటం జరిగింది.ఇస్లాము ఎప్పటికీ సంపాదించటానికీ మరియు కూడబెట్టటానికి వ్యతీరేకం కాదు కానీ అదే సంపాదనలో ఇతర పేద ముస్లిముల హక్కు కూడా ఉందని ఇస్లాము చెబుతుంది.ఎందుకంటే ఇస్లాములో ధనికులు పేదవాళ్ళు అనే రెండు వర్గాలు లేవు అందరూ సమానులు మరియు అందరితో సమానంగా జీవించాలి అనేదే ఇస్లాము ఉద్దేశం.         

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1