హరూన్ రషీద్ మొసలి కన్నీరు 

సోమ, 04/01/2019 - 14:43

ఇమాం కాజిం(అ.స) వలన తన రాజ్యాధికారానికి ముప్పుందని గ్రహించిన హరూన్ రషీద్ ఇమాం మూసా కాజిం(అ.స)ల వారిని ఏదో వంకతో ఖైది చేసి హింసించటం మొదలుపెట్టాడు.

హరూన్ రషీద్ మొసలి కన్నీరు

అబ్బాసీ ఖులఫాల రాజ్యాధికారం మొదలైన తరువాత కాలం ఇమాం[అ.స]ల వారిపై కష్టంగానే సాగింది. తన కొడుకుని ఖలీఫా చేయాలనే ఉద్దేశంతోనే హరూన్ రషీద్ ఇమాం కాజిం[అ.స]ల వారిని 198వ హిజ్రిలో బగ్దాద్ రప్పించటం జరిగింది. తన దర్బారులో వున్న చాడీలు చెప్పే వాళ్ళ చాడీలు కూడా హరూన్ ఇమాం[అ.స]ల వారిని ఇబ్బందులకు గురిచేయటానికి కారణం అని చెప్పవచ్చు. వారెవరో కాదు ఇమాం కాజిం[అ.స]ల వారి సొంత ఇంటి వారే. వారి సోదరులలో ఒకడైన మొహమ్మద్ బిన్ జాఫర్ ఒక రోజు హరూన్ వద్దకు వచ్చి “ఈ భూమండలంపై ఇద్దరు ఖలీఫలు ఉండబోతున్నారని నేను అనుకోవటం లేదు, నేను నా తోబుట్టువైన ఇమాం మూస కాజిం[అ.స] ను చూసాను, వారు ఖలీఫాగా మీ దర్బారులోకి విచ్చేసారు అందరూ వారికి సలాము చేస్తున్నారు” అన్నాడు. హరూన్ రషీద్ ప్రజలు ఇమాం కాజిం[అ.స]ల పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి ఓర్వలేక ప్రతీ చోట ఎంతో మంది గూడాచారులను పెట్టి ఇమాం[అ.స]ల వారి కదలికలపై నిఘా పెట్టాలని ఆదెశించాడు. కానీ చివరకు ఇమాం కాజిం[అ.స]ల వారి అత్యున్నత వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతున్న ప్రజానికాన్ని చూసి ఓర్వలేక తన రాజ్యాధికారానికి ఇమాం[అ.స]ల వారు చాలా ప్రమాదమని గ్రహించి వారిని ఖైదు చేయాలని నిర్ణయించుకున్నాడు. యహ్యా బిన్ ఖాలిద్ వివరణ ప్రకారంగా ఇమాం కాజిం[అ.స]ల వారిని ఖైదు చేయటానికి మునుపు హరూన్ మదీనాలో దైవప్రవక్త(స.అ.వ)ల వారి సమాధి వద్దకు వచ్చి వారిని సంబోధించి ఈ విధంగా పలికాడు: “ఓ దైవప్రవక్తా[స.అ] ఏ నిర్ణయమైతే నేను తీసుకున్నానో దానికి క్షమాపన కోరుతున్నాను! మూసా కాజిం[అ.స]ల వారిని ఖైదు చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే రేపటి రోజు నీ యొక్క సమాజంలో యుధ్ధం మొదలై దాని ఫలితంగా రక్తాలు పారే అవకాశముంది” అని అన్నాడు. ఆ తరువాతి రోజున ఫజల్ బిన్ రబీ ను కాజిం[అ.స]ల వారిని ఖైదు చేయటానికి పంపించాడు. ఇమాం[అ.స] నమాజు చేస్తున్న సమయంలో వారిని ఖైదు చేసి జైలులో బంధించటం జరిగింది.

రెఫరెన్స్: సీరతు రసూలిల్లాహి వ అహ్లె బైతిహ్,2వ భాగం,పేజీ నం:382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10