ఖైదులో ఇమాం మూసా కాజిం(అ.స) ల వారి వ్యక్తిత్వాన్ని వారి దయాగుణాలను గమనించిన వారికి వారి పరిస్థితిపై దయ కలిగేది వీరిని ఎందుకు ఖైదు చేసామో?అని బాధపడి వారిని విడుదల చేసేవారు.

ఇమాం[అ.స]ల వారిని బంధించి బస్రా పట్టణానికి తరలించిన తరువాత వారిని బస్రా యొక్క గవర్నర్ అయినా ఈసా బిన్ జాఫర్ కి అప్పజెప్పటం జరిగింది. అతని వద్ద ఇమాం[అ.స]ల వారు ఒక్క సంవత్సరం ఖైదుగా ఉన్నారు.ఆ తరువాత ఈసా హరూన్ కు ఈ విధంగా లేఖ రాసాడు: “మూసా బిన్ జాఫర్[అ.స]ల వారిని నా నుండి వెనక్కి తీసుకో మరియు వారిని నీకు ఎవరి వద్దకు పంపాలనుకుంటే వారి వాద్దకు పంపు లేకపోతే నేను వీరిని నా ఖైదు నుండి విడుదల చేస్తాను అని చెప్పాడు.ఈ సంవత్సర కాలంలో వీరిని ఖైదు చేయటానికి నేను ఏ కారణాన్ని,ఏ వంకను సంపాదించలేకపోయాను చివరికి ఒక రోజు వారు ప్రార్ధనలో ఉండగా చాటుగా వారి ప్రార్ధనను ఆలకించాను నా గురించి మన సామ్రాజ్యం గురించి శపిస్తారని (అనుకున్నాను) కానీ వారు ఆ దేవునితో తన గురించి ప్రార్ధించటం తన పాపాలకు క్షపాణను కోరుకుంటుండటం చూశాను” అని అన్నాడు. హరూన్ రషీద్ ఒకనిని పంపి ఇమాం కాజిమ్[అ.స]ల వారిని ఈసా బిన్ జాఫర్ నుండి వెనక్కి బగ్దాదులో ఫజల్ బిన్ రబీ వద్ద ఖైదు చేయటం జరిగింది.చాలా కాలం అతని వద్ద ఖైదుగా ఉన్నారు. మరలా ఫజల్ హరూన్ కు లేఖను రాసి ఇమాం ల వారిని తన వద్ద నుండి తీసుకుని ఫజల్ బిన్ యహ్యాకు అప్పగించమని దరఖాస్తు చేసాడు. కొంతకాలం తరువాత ఇమాం కాజిం[అ.స]ల వారు రఖ్ఖా పట్టణంలో మంచి స్థితిలో కాలం గడుపుతున్నారని హారూన్ కు వార్త అందింది. అది నిజమో కాదో తెలుసుకోవాలని తన సేవకుడైన మస్రూర్ ను వెంటనే బాగ్దాదు పంపించాడు. ఆ తరువాత సింది బిన్ షాహక్ కు ఒక లేఖను రాసాడు, బాగ్దాదు నుండి హరూన్ కు అందిన వార్త నిజమేనని తెలిసింది. ఫజల్ బిన్ యహ్య ను పిలిపించి అతనిని నగ్నంగా చేసి వంద కొరడా దెబ్బలను కొట్టడం జరిగింది. మరోవైపు మస్రూర్ బాగ్దాదులో ఉన్న పరిస్థితులను ఒక లేఖ ద్వారా వివరించాడు.ఆ తరువాత హరూన్ ఇమాం కాజిం[అ.స]ల వారీని ఖైదు చేసి సిందీ బిన్ షాహక్ కు అప్పగించాలని ఆజ్ఞాపించాడు. చాలా క్రూరుడైన సిందీ ఇమాం ల వారిని అవమానించాడు మరియు వారిని కొట్టడం లాంటివి చేసి వారిని బాధించేవాడు. చివరకు హిజ్రి యొక్క 183వ సంవత్సరంలో రజబ్ మాసపు 25వ తారీకున విషపూరిత ఖర్జూరముతో ఇమాం కాజిం[అ.స]ల వారిని చంపటం జరిగింది. ఏ పాపము ఎరుగకుండా ఎన్నో బాధలను భరించిన తరువాత బాగ్దాదు యొక్క కారాగారంలో ఈ సూర్యుడు అస్తమించాడు.
రెఫరెన్స్: సీరతు రసూలిల్లాహి వ అహ్లె బైతిహ్,2వ భాగం,పేజీ నం:382.
వ్యాఖ్యలు
Thanks for brief about Imam Musa Kazim a.s, jazakallah
వ్యాఖ్యానించండి