మనము విశ్వాసులమా?

సోమ, 04/22/2019 - 18:43

ఇతర విశ్వాసుల పట్ల మన ఆలోచనా వైఖరి ఎలా ఉండాలో తెలియజేసే ఒక సంఘటన.

మనము విశ్వాసులమా?

ఒక వ్యక్తి ఇమాం సాదిఖ్[అ.స]ల వారి వద్దకు వచ్చి ఒక ఆతిధ్యంలో మీ గురించి ఫలానా వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడని, అన్నాడు. దానికి జవాబుగా ఇమాం[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “నిజానికి నువ్వు తప్పుగా విని ఉంటావు”, దానికి అతడు “కాదు నేను సరిగ్గానే విన్నాను” అన్నాడు. మరలా ఇమాం[అ.స]ల వారు “అది రాత్రి అవ్వటం వలన మరియు హడావిడిగా ఉండటం వలన నువ్వు సరిగ్గా విని ఉండవు(తప్పుగా విని ఉంటావు)” అన్నారు. దానికి జవాబుగా అతడు “కాదు నేను నిజంగానే సరిగ్గా విన్నాను” అన్నాడు, మరలా ఇమాం[అ.స]ల వారు “అతడు కోపంగా ఉండటం వలన లేదా ఎవరైనా బలవంతం చేయటం వలన అలా చెప్పి ఉండవచ్చు” అన్నారు.దానికి ఆ వ్యక్తి కాదు “అతడు  సౌఖ్యంగానే ఎవరి బలవంతం లేకుండానే అలా చెప్పాడు” అన్నాడు. ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఎన్నో రకాలుగా అతనిని మోహింపచేయుటకు ప్రయత్నించారు. చివరికి ఆ వ్యక్తి అలిసిపోయి తాను చేసిన పనికి పస్చాత్తాప్పడ్డాడు.
నిజమైన విశ్వాసులెవరంటే తమ సహోదరులైన ఇతర విశ్వాసుల పట్ల మంచి ఆలోచనా వైఖరిని కలిగి ఉంటారు. ఇతర విశ్వాసులను అతిగా అనుమానించటం కానీ వారి పట్ల దురాలోచనా వైఖరిని కానీ కలిగి ఉండరు. మనలో కూడా ఈ లక్షణం ఉన్నదా? మన ఆలోచనా వైఖరి కూడా ఈ విధంగానే ఉన్నదా? మనము విశ్వాసులమేనా? ఆలోచించవలసిన విషయం. 

రెఫరెన్స్:మిస్బాహుష్ షరీయ,పేజీ నం:515.

  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3