కపటుని యొక్క లక్షణాలు

సోమ, 04/29/2019 - 16:31

కపటుని యొక్క లక్షణాలు దైవప్రవక్త[స.అ]ల వారి నోట.

కపటుని యొక్క లక్షణాలు

కపటవైఖరిని అవలంభించరాదని ఇస్లాము ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే కపటత్వమనేది ఒక వ్యాధి ఈ వ్యాధిగల వాడు పూర్తి సమాజానికే హానికరము. అతడి ప్రవర్తన మరియు అతడు అవలంభించే ద్వంద్వ వైఖరి రెండూ ధర్మవిరుధ్ధమైనవే. దైవఖురాను కూడా వారి లక్షణాలను కొన్ని చోట్ల ప్రస్థావిస్తుంది. కపటి ఇతరులను మోసము చేస్తున్నాను అనుకుంటాడు కానీ తనను తానే మోసము చేసుకుంటాడు. కపట వైఖరి కలిగినవారు ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా చివరకు చేరేది నరకానికే. దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమశ్రేణిలోకి పోతారు, వారిని సహాయపడేవారిని నీవు ఎన్నటికీ చూడలేవు”[అన్ నిసా/145]. వారిని ఈ లోకంలో గుర్తించటం ఎలా? దీనికి దైవప్రవక్త వారి హదీసులో జవాబు దొరుకుతుంది. మహనీయ ప్రవక్త[స.అ]ల వారు కపటుని యొక్క లక్షణాలను ప్రస్థావిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఒకటి అబధ్ధాలాడతాడు, రెండు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోడు, మూడు నమ్మకద్రోహానికి పాల్పడతాడు.[తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:316].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7