కష్టాలలో ఒకరినొకరు ఆదుకోండి

సోమ, 04/29/2019 - 17:27

కష్టాలలో ఇతరులను ఆదుకోవటం ఒక తోటి విశ్వాసునిగా మన కర్తవ్యం కాదా? ఆలోచించండి!!  

కష్టాలలో ఒకరినొకరు ఆదుకోండి

"హమాద్ బిన్ ఉస్మాన్" ఉల్లేఖన ప్రకారం: ధరలు పెరగటం మరియు కరువు కారణంగా మదీనా వాసులు తమ ఆహారాన్ని సమకూర్చుకోవటంలో ఎన్నో కష్టాలకు గురి అయ్యేవారు. కానీ ఇమాం సాదిఖ్[అ.స]ల వారి భండారంలో ఎక్కువ మొత్తంలో నాణ్యమైన గోధుమలు పోగుచేయబడి ఉన్నాయి. వాటిని సంవత్సరం ముందు నుండి మరియు ధరలు పెరిగే ముందే ఖరీదు చేసి పోగుచేయటం జరిగింది. అప్పుడు ఇమాం సాదిఖ్[అ.స]ల వారు తన నౌకరుతో “కొంత మొత్తంలో బార్లీని కొని దానిని గోధుమలతో కలిపి ఆ తారువాత వాటిని(బార్లీని కలిపిన గోధుమలను) బాజారులో అమ్ము. ఎందుకంటే మనము నాణ్యమైన గోధుమలను తిని ప్రజలు నాణ్యత లేని గోధుమలను వాడటం నాకు నిరాశకు గురిచేస్తుంది” అని అన్నారు. ఈ నాడు కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఇమాం[అ.స]ల వారి అనుచరులుగా ఇతరులను ఆదుకోవటం మన కర్తవ్యం.

రెఫరెన్స్: షేఖ్ కులైనీ, అల్ కాఫి, 5వ భాగం, పేజీ నం:166.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9