అనుగ్రహాల మాసం

మంగళ, 04/30/2019 - 18:55

అల్లాహ్ ప్రేమకు, కరుణకు, దయానుగ్రహాలకు ప్రతిరూపమైన రమజాన్ మాసమా నీకు వందనం.

అనుగ్రహాల మాసం

నేస్తమా! నీ రాకతో మా హృదయాలలో ఆనందాలు వెల్లువిరుస్తాయి మరియు నీవు దూరమవుతున్నప్పుడు మా మనస్సులను దుఖభరితం చేస్తావు నీకు వందనం, నీవు ఆ అల్లాహ్ కరుణకు ఆయన అనుగ్రహానికి ప్రతిరూపము నీకు వందనం, ఏ మాసపు ఘడియలైనా నీ ఘడియలకు సాటి రాలేవు ఎందుకంటే నీకు ఆ అల్లాహ్ ప్రసాదించిన ప్రతిష్టత అలాంటిది నీకు వందనం, ఎందరో పాపాత్ములు నీ వలనే శిక్షల నుండి తప్పించబడతారు నీకు వందనం, నీలో ఉన్న ఒకరాత్రి(షబే ఖద్ర్) వెయ్యి నెలల కంటే మేలైనదంట ఆ రాత్రిలో దైవదూతలు, ఆత్మ(జిబ్రఈల్) దీవి నుండి ఈ భువికి దిగి వస్తారట నీకు వందనం, ఈ ఘనమైన రాత్రి యందే స్పష్టమైన నిదర్శనం మరియు స్పష్టమైన జ్యోతిని(దివ్యఖురాను)అవతరించటం జరిగింది నీకు వందనం, నువ్వే మా పాపాలను చెరిపేసి మమ్మల్ని పరిశుధ్ధులను చేశావు నీకు వందనం, నీతో గడిపిన ఆ ఘడియలలో మా హృదయాలు మెత్తబడ్డాయి మరియు మా పాపాలు తగ్గాయి నీకు వందనం, ఎన్నో చెడులను మా నుండి దూరం చేశావు మరియు ఎన్నో మంచి పనుల్ని మాకు అలవాటు చేసావు నీకు వందనం, కానీ ఎంత తొందరగా మమ్మల్ని వదిలి వెళుతున్నావు నీ దూరాన్ని మేము భరించలేము, నీవు దూరమైన నాటి నుండి నీ వలన మాకు లభించే వరాలు మరియు మాపై ఆ అల్లాహ్ కురిపించే దయానుగ్రహాలు కూడా దూరమవుతాయి కానీ మరలా నిన్ను కలిసే అదృష్టం  మాకు ప్రసాదించాలని ఆ భగవంతునితో ఒకటే ప్రార్ధన.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9